అల్లు వారింటికి మెగాస్టార్‌!

Saturday, January 18, 2025

‘పుష్ప-2’ ప్రీమియర్స్ సమయంలో చోటు చేసుకున్న విషాద ఘటన పై హీరో అల్లు అర్జున్‌ని చిక్కడపల్లి పోలీసులు శుక్రవారం ఉదయం అరెస్ట్ చేశారు. ఈ విషయం తెలుసుకున్న తెలుగు సినీ పరిశ్రమ మొత్తం షాక్‌ అయ్యింది.  నేపథ్యంలో అల్లు అర్జున్‌కి సపోర్ట్‌గా పలువురు సినీ ప్రముఖులు చిక్కడపల్లి పోలీస్ స్టేషన్‌కి వస్తున్నారు.

ఈ క్రమంలోనే చిక్కడపల్లి పోలీసులు మెగాస్టార్ చిరంజీవిని పోలీస్ స్టేషన్‌కి రావద్దని చెప్పారు. దీంతో మెగాస్టార్ చిరంజీవి, ఆయన భార్య సురేఖ అల్లు అరవింద్ ఇంటికి వచ్చారు. ఇలాంటి కష్ట సమయంలో తమ కుటుంబ సభ్యులకు బాసటగా నిలిచేందుకు మెగాస్టార్ అల్లు ఇంటికి వచ్చారు.

ఇక బన్నీపై ఇప్పటికే పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేసిన పోలీసులు, తాజాగా ఆయన్ను వైద్య పరీక్షల నిమిత్తం గాంధీ ఆసుపత్రికి తరలించారు.

Related Articles

  !!!!!!!!   Hiring content writers   !!!!!!!!!
Contact us : [email protected]

Latest Articles