మెగాప్రిన్స్‌ ర్యాంపేజ్‌!

Tuesday, January 21, 2025

మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘మట్కా’ ఇప్పటికే ప్రేక్షకుల్లో సాలిడ్ అంచనాలను క్రియేట్ చేసింది. ఈ సినిమాను దర్శకుడు కరుణ కుమార్ పీరియాడిక్ యాక్షన్ థ్రిల్లర్‌గా రూపొందించాడు. ఈ సినిమాలో వరుణ్ తేజ్ విభిన్నమైన గెటప్స్‌లో కనిపిస్తుండటంతో ఈ సినిమాపై మంచి బజ్ ఏర్పడింది. ఇక తాజాగా ఈ చిత్ర ట్రైలర్‌ను మెగాస్టార్ చిరంజీవి చేతుల మీదుగా లాంచ్‌ చేసిన సంగతి తెలిసిందే.

మట్కా ట్రైలర్ పవర్‌ఫుల్‌గా కట్ చేశారు మేకర్స్. ఈ సినిమా కథను ప్రేక్షకులకు చెప్పే  విధంగా ట్రైలర్ కట్ అయితే ఉంది. ఇక ఈ ట్రైలర్‌లో కొన్ని పవర్‌ఫుల్ డైలాగ్స్ కూడా పేలాయి. వరుణ్ తేజ్ విభిన్న ఎమోషన్స్‌తో ట్రైలర్‌లో ఆకట్టుకున్నాడు. ఆయన డైలాగ్ డెలివరీ కూడా సూపర్‌గా ఉంది.

ఇక జీవి.ప్రకాశ్ కుమార్ బీజీఎం ఈ ట్రైలర్‌ను వేరే లెవెల్‌కి తీసుకెళ్లిందని తెలుస్తుంది. కూలీ నుండి మట్కా కింగ్‌గా వరుణ్ తేజ్ ఎలా ఎదిగాడనేది మనకు ఈ సినిమాలో కనిపించబోతుంది.

మొత్తానికి వరుణ్ తేజ్ ఈసారి సాలిడ్ సబ్జెక్ట్‌తో పాటు పవర్‌ఫుల్ పర్ఫార్మెన్స్‌తో మనముందుకు వస్తున్నాడని చెప్పాలి. ఈ సినిమాను పీరియాడిక్ చిత్రంగా తెరకెక్కించారు. ఇక ఈ సినిమాలో మీనాక్షి చౌదరి, నోరా ఫతేహి, నవీన్ చంద్ర, కన్నడ కిషోర్, అజయ్ ఘోష్ ముఖ్య పాత్రల్లో చేశారు. వైరా ఎంటర్‌టైన్‌మెంట్స్, ఎస్ఆర్‌టీ ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్లు ఈ సినిమాను సంయుక్తంగా ప్రొడ్యూస్ చేస్తున్నాయి. నవంబర్ 14న మట్కా చిత్రాన్ని ప్రపంచ వ్యాప్తంగా  గ్రాండ్ విడుదల చేసేందుకు మేకర్స్ రెడీ గా ఉన్నారు.

Related Articles

  !!!!!!!!   Hiring content writers   !!!!!!!!!
Contact us : [email protected]

Latest Articles