మన తెలుగు సినిమా దగ్గర పలు చిత్రాల భారీ క్లాష్ ఎప్పటికప్పుడు జరుగుతూనే ఉంటుంది. కానీ కొన్ని క్లాష్ లు మాత్రం ఒకింత ఆసక్తికరంగా ఉంటాయని చెప్పుకోవచ్చు. అలా వచ్చే ఏడాది దసరాకి ఇప్పటి నుంచే భారీ క్లాష్ కి రంగం సిద్ధం అయ్యిపోయింది. మరి ఆల్రెడీ వచ్చే ఏడాది దసరా బరిలో నందమూరి నటసింహం బాలకృష్ణ బోయపాటిల సెన్సేషనల్ సీక్వెల్ మూవీ “అఖండ 2 తాండవం” రెడీ గా ఉన్న సంగతి తెలిసిందే.
దీంతో దసరా స్లాట్ లో ఆల్రెడీ బాలయ్య దిగిపోగా ఇపుడు తనకి పోటీగా అదే డేట్ లో మెగా యంగ్ హీరో సాయి దుర్గ తేజ్ భారీ చిత్రం “సంబరాల ఏటి గట్టు” విడుదలని కూడా కన్ఫర్మ్ చేశారు. మరి నిన్ననే వచ్చిన గ్లింప్స్ ఒక్కసారిగా సాలిడ్ హైప్ లేపింది. దీంతో బాలయ్య అఖండ 2 కి ఇది గట్టి పోటీ ఇస్తుంది అని డెఫినెట్ గా చెప్పొచ్చు.
మరి అఖండ 2 సెప్టెంబర్ 25 కే లాక్ చేయగా తేజు సినిమా కూడా అదే డేట్ ని ప్రకటించడం మరో విశేషం. దీంతో ఈ క్రేజీ క్లాష్ పట్ల ఇపుడు నుంచే మంచి ఆసక్తి రేగుతుంది అని చెప్పాలి.