గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ హీరోగా బుచ్చిబాబు దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రం ‘పెద్ది’. శ్రీ రామనవమి పర్వదినాన్ని పురస్కరించుకొని టీమ్ నిన్న ‘పెద్ది గ్లింప్స్’ రిలీజ్ చేసింది. ఈ ఫస్ట్ గ్లింప్స్ సోషల్ మీడియాలో సంచలనం సృష్టించింది, మెగా అభిమానులు ఆ విజువల్స్ చూసి ఫిదా అయిపోయారు. అయితే, కొంతమంది అభిమానులు నిరాశ చెందారు. కాకపోతే, అది పెద్ది ఫస్ట్ గ్లింప్స్ వల్ల కాదు, మరో కారణంతో వాళ్ళు నిరాశ చెందారు.
శ్రీరామ నవమి సందర్భంగా, చాలా సినిమాలు పండుగ శుభాకాంక్షలతో ప్రత్యేక పోస్టర్లతో వచ్చాయి. కానీ, మెగాస్టార్ చిరంజీవి విశ్వంభర, అలాగే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ‘హరిహర వీరమల్లు’ సినిమాల నుండి ఎటువంటి అప్ డేట్ రాలేదు. కనీసం పండుగ పోస్టర్ కూడా రాలేదు. దీంతో, మెగా అభిమానులు నిరాశపడ్డారు. మరోవైపు హరిహర వీరమల్లు మే 9, 2025న విడుదలకు రెడీ కాబోతుంది. కానీ ఇంకా ప్రమోషన్స్ ను స్టార్ట్ చేయలేదు.