పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా, ప్రియాంక అరుల్ మోహన్ హీరోయిన్‌గా యువ దర్శకుడు సుజీత్ తెరకెక్కించిన ఓజి సినిమాకి వచ్చిన క్రేజ్ ఎప్పటిలా కాకుండా మరింతగా పెరిగింది. భారీ అంచనాల నడుమ థియేటర్లలోకి వచ్చిన ఈ చిత్రం ఇప్పటికే 250 కోట్లకు పైగా వసూళ్లు సాధించి రికార్డులు సృష్టిస్తోంది. పవన్ సినిమాల దగ్గర ఇలా భారీ గ్రాస్ వసూళ్లు అధికారికంగా ప్రకటించబడటం అభిమానుల్లో కొత్త ఉత్సాహాన్ని రేకెత్తించింది.
ఇక ఇటీవల ఈ సినిమాకి మెగా ఫ్యామిలీ కలిసి హాజరై చూసిన విషయం సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారింది. హైదరాబాద్ ప్రసాద్ ల్యాబ్స్‌లో జరిగిన ఈ ప్రత్యేక ప్రదర్శనలో మెగాస్టార్ చిరంజీవి, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్‌తో పాటు పవన్ కళ్యాణ్ కూడా పాల్గొనడం ప్రత్యేకంగా నిలిచింది. దర్శకుడు సుజీత్, సంగీత దర్శకుడు థమన్, నిర్మాత దానయ్య, సినిమాటోగ్రాఫర్ రవి కే చంద్రన్ వంటి ప్రధాన టీమ్ సభ్యులు కూడా అక్కడే ఉండటంతో ఆ షోకి మరింత హంగు చేకూరింది.
వీళ్ళందరినీ ఒకే ఫ్రేమ్‌లో చూసిన ఆ క్షణం ఫోటో రూపంలో బయటకు రావడంతో మెగా అభిమానులు ఎంతో సంతోషం వ్యక్తం చేస్తున్నారు.
