క బృందానికి మెగా అభినందనలు!

Friday, December 5, 2025

ఈ దీపావళి కానుకగా టాలీవుడ్‌ బాక్సాఫీస్ వద్ద  చిన్న సినిమాగా  వచ్చిన తాజా సినిమాల్లో యువ హీరో కిరణ్ అబ్బవరం నటించిన సాలిడ్ థ్రిల్లర్ “క” మూవీ కూడా ఒకటి. మరి తాను డ్యూయల్ రోల్ లో నటించిన ఈ సినిమాని దర్శకులు సందీప్, సరోజ్ లు తెరకెక్కించిన ఈ చిత్రం మంచి విజయాన్ని అందుకున్నారు. ఈ సినిమా కిరణ్ కెరీర్లో హైయెస్ట్ గ్రాసర్ గా నిలిచింది.

అయితే ఈ సినిమా రిలీజ్ అయ్యాక చాలా మంది నుంచి ప్రశంసలు వచ్చాయి కానీ వీటికి మించిన మెగా బ్లెస్సింగ్స్ అయితే ఇపుడు చిత్ర యూనిట్ కి దక్కాయి. హీరో కిరణ్ అబ్బవరం తో పాటు చిత్ర యూనిట్ అందరికీ మెగాస్టార్ కలిసి మరీ తన అభినందనలు సినిమా తాలూకా ఎక్స్ పీరియన్స్ ని పంచుకున్నారు.

దీంతో కిరణ్ ఆ ఫోటోలు సోషల్‌ మీడియాలో పోస్ట్‌ చేసి ఎంతో ఆనందం వ్యక్తం చేశాడు. బాస్ నుంచి ప్రశంసలు వచ్చాయి.. ఎప్పుడు చిరంజీవి గారిని కలిసినా ఓ ఆశీర్వాదంలా ఉంటుంది. ఒక గంట సేపు అంత పెద్ద నటుడు, టాలీవుడ్‌ గాడ్‌ ఫాదర్‌ మాతో మాట్లాడ్డం ఒక మెమొరబుల్ కన్వర్జేషన్ అంటూ కిరణ్ సంతోషంతో ఉక్కిరిబిక్కిరి అయ్యాడు. దీనితో ఈ ఫోటోలు ఇపుడు వైరల్ గా మారాయి.

Related Articles

  !!!!!!!!   Hiring content writers   !!!!!!!!!
Contact us : [email protected]

Latest Articles