ఇటీవల ఓటిటి ప్లాట్‌ఫార్మ్స్ లో కొత్త కొత్త వెబ్ సిరీస్ లు వరుసగా వస్తున్నాయి. అందులో కొన్ని బాగా పాపులర్ అయ్యి ప్రేక్షకుల నుండి మంచి స్పందన పొందుతున్నాయి. అలాంటి హిట్ సిరీస్ ల జాబితాలో తెలుగు నుంచి వచ్చిన ఒక వెబ్ సిరీస్ కూడా చోటు దక్కించుకుంది.
దర్శకుడు దేవా కట్ట తెరకెక్కించిన మయసభ అనే రాజకీయ నేపథ్య సిరీస్ ఇప్పుడు అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. ఇద్దరు పెద్ద రాజకీయ కుటుంబాల వారసులు ఒకరితో ఒకరు గాఢమైన స్నేహం పెట్టుకుని, ఆ తర్వాత జరిగే సంఘటనల చుట్టూ ఈ కథ నడుస్తుంది. చైతన్య రావు, ఆది పినిశెట్టి ప్రధాన పాత్రల్లో కనిపించిన ఈ పొలిటికల్ థ్రిల్లర్ ఆగస్ట్ 7న సోనీ లివ్ లో విడుదలైంది.
ఈ సిరీస్ రాకతోనే మంచి టాక్ రావడం మొదలైంది. కేవలం తెలుగు లోనే కాదు, పాన్ ఇండియా భాషల్లో స్ట్రీమింగ్ కావడంతో మరింత పెద్ద స్థాయిలో ప్రేక్షకులు కనెక్ట్ అయ్యారు. దాంతో మయసభ ఇండియాలో టాప్ 5 షోస్ లో ఒకటిగా గుర్తింపు పొందింది.
ఇంతవరకు ఏ తెలుగు వెబ్ సిరీస్ కి రాని రేంజ్ లో స్పందన దక్కించుకోవడం ప్రత్యేకమైంది.
