నైజాంలో వీరమల్లు టికెట్లకి భారీ ధరలు!

Friday, December 5, 2025

పవన్ కళ్యాణ్ ప్రధాన పాత్రలో రూపొందిన “హరి హర వీర మల్లు” సినిమా విడుదలకు సమయం దగ్గరపడుతోంది. ఇప్పటికే బుకింగ్‌లు ప్రారంభమయ్యాయి. అందులో భాగంగా రెండు రాష్ట్రాల ప్రభుత్వాలు టికెట్ ధరల పెంపును ఆమోదించాయి. ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం ఈ చిత్రానికి ప్రత్యేక టికెట్ ధరల జారీకి గ్రీన్‌సిగ్నల్ ఇచ్చింది. ఇక తెలంగాణలో విడుదలపై తొలుత కొన్ని సందిగ్ధతలు ఉన్నా, చివరికి అన్నీ క్లియర్ అయ్యాయి. ఇప్పుడు ఈ ప్రాంతంలో మైత్రీ మూవీ డిస్ట్రిబ్యూటర్స్ LLP సినిమాను విడుదల చేస్తోంది.

తెలంగాణ ప్రభుత్వం కూడా టికెట్ రేట్లు పెంచేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ముఖ్యంగా జూలై 23 రాత్రి 9 గంటల తర్వాత ప్రత్యేక ప్రీమియర్ షోల నిర్వహణకు అవకాశం కల్పించింది. ఈ ప్రీమియర్ షో టికెట్ల ధర సుమారుగా రూ. 708 (రూ.600+ GST)గా ఉండనుంది.

జూలై 24 నుంచి 27 వరకు మల్టీప్లెక్స్‌లలో టికెట్ ధర రూ. 200 + జీఎస్టీగా ఉండగా, సింగిల్ స్క్రీన్‌లకు రూ. 150 + జీఎస్టీగా నిర్ణయించారు. అంటే ఆ రోజులలో మల్టీప్లెక్స్ టికెట్ ధర సుమారుగా రూ. 531, సింగిల్ స్క్రీన్ టికెట్ రూ. 354 వరకు వెళ్లే అవకాశం ఉంది.

తర్వాత జూలై 28 నుంచి ఆగస్టు 2 వరకూ మళ్లీ టికెట్ రేట్లు కాస్త తగ్గుతాయి. మల్టీప్లెక్స్ టికెట్ రూ. 150 + జీఎస్టీ కాగా, సింగిల్ స్క్రీన్ టికెట్ రూ. 106 + జీఎస్టీగా ఉంటుంది. ఈ సమయంలో మల్టీప్లెక్స్ టికెట్ సుమారుగా రూ. 472, సింగిల్ స్క్రీన్ టికెట్ రూ. 302గా ఉండొచ్చు. పైగా ఈ రోజులలో రోజుకు ఐదు షోలు ప్రదర్శించేందుకు అనుమతినిచ్చారు.

ఇన్ని సౌకర్యాలు లభించడంతో ఈ సినిమా మొదటి వారంలోనే భారీ వసూళ్లు సాధించే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇప్పుడే ఆంధ్రప్రదేశ్‌లో బుకింగ్స్‌ ప్రారంభమయ్యాయి. నైజాంలో కూడా ఈరోజు ఉదయం 8 గంటల నుంచి బుకింగ్‌లు ఓపెన్ అయ్యే విధంగా నిర్మాతలు ప్రకటించారు.

జ్యోతి కృష్ణ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో పవన్ సరసన నిధి అగర్వాల్ నటించగా, ప్రతినాయక పాత్రలో బాబీ డియోల్ కనిపించనున్నాడు. ఈ చిత్రాన్ని ప్రముఖ నిర్మాత ఏఎం రత్నం నిర్మించారు. విడుదలకు సర్వం సిద్ధంగా ఉండడంతో అభిమానుల్లో ఉత్సాహం తారాస్థాయికి చేరింది.

Related Articles

  !!!!!!!!   Hiring content writers   !!!!!!!!!
Contact us : [email protected]

Latest Articles