ఫైనల్‌ గా తెరపడింది!

Monday, December 8, 2025

మాస్ మహారాజ రవితేజ హీరోగా, శ్రీలీల హీరోయిన్ గా నటిస్తున్న “మాస్ జాతర” అనే సినిమా మీద సినీ ప్రేక్షకులలో భారీ ఆసక్తి నెలకొంది. ఈ సినిమాకి భాను బోగవరపు దర్శకత్వం వహిస్తున్నాడు. మొదట అనౌన్స్ చేసినప్పటి నుంచి ఒక్కోసారి ఇచ్చిన అప్డేట్లతో సినిమాపై అంచనాలు ఒక్కోస్టెప్ పైకెళ్తున్నాయి.

మూవీ ఇప్పటికే విడుదల కావాల్సి ఉండగా, కొన్ని కారణాల వల్ల ప్రాజెక్ట్ కొంత డిలే అయింది. ఈ వాయిదాల వల్ల మాస్ అభిమానులు ఎప్పుడెప్పుడా అని కొత్త విడుదల తేదీ కోసం ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఇప్పుడు ఈ సస్పెన్స్ కి చెక్ పెట్టే అప్డేట్ రాబోతోందని చెప్పొచ్చు.

మేకర్స్ ఇచ్చిన సమాచారం ప్రకారం,  మే 29 ఉదయం 11 గంటల 7 నిమిషాలకి ఒక సాలిడ్ అప్డేట్ బయటకు రానుంది. ఇది చూసి అందరికి ఇదే కొత్త రిలీజ్ డేట్ ప్రకటించబోతున్నారని అర్థమవుతోంది.

ఈ ప్రాజెక్ట్ ని సితార ఎంటర్టైన్మెంట్స్ నిర్మిస్తుండగా, మ్యూజిక్ విభాగాన్ని భీమ్స్ సిసిరోలియో అందిస్తున్నాడు. ఈ సినిమా మీద అభిమానులు పెట్టుకున్న అంచనాలు ఎక్కడా తగ్గడం లేదు. రేపటి అప్డేట్ తో మరోసారి సినిమా మీద హైప్ పెరుగుతుందనడంలో ఎలాంటి సందేహం లేదు.

Related Articles

  !!!!!!!!   Hiring content writers   !!!!!!!!!
Contact us : [email protected]

Latest Articles