టాలీవుడ్ ఎనర్జిటిక్ స్టార్ రవితేజ, శ్రీలీల జంటగా తెరకెక్కుతున్న యాక్షన్ ఎంటర్టైనర్ మాస్ జాతరపై మంచి క్రేజ్ ఉంది. బాను భోగవరపు దర్శకత్వంలో వస్తున్న ఈ సినిమాకు మొదటినుంచే డీసెంట్ హైప్ క్రియేట్ అయింది. అయితే రిలీజ్ విషయంలో మాత్రం వరుస వాయిదాలు పడుతూ ఆగస్ట్ 27న థియేటర్స్ లోకి వస్తుందని అనుకున్నా, ఆ ప్లాన్ కూడా కుదరలేదు. మేకర్స్ తాజాగా సినిమా మళ్లీ వాయిదా పడుతోందని అధికారికంగా ప్రకటించారు.
ఇటీవల తెలుగు సినీ ఇండస్ట్రీలో జరిగిన స్ట్రైక్ కారణంగా షూటింగ్ పనుల్లో ఆలస్యం కావడం వల్లే ఈ నిర్ణయం తీసుకున్నామని టీమ్ చెప్పింది. కొత్త రిలీజ్ డేట్‌ను త్వరలో ప్రకటిస్తామని కూడా క్లారిటీ ఇచ్చారు. కానీ ప్రస్తుతానికి సెప్టెంబర్ నెలలో దాదాపు అన్ని స్లాట్లు బిజీగా ఉండటంతో అక్టోబర్‌లో మాత్రమే సినిమా థియేటర్స్‌లోకి వచ్చే అవకాశం ఎక్కువగా కనిపిస్తోంది.
