రాజాసాబ్‌ పార్ట్‌ 2 పై మారుతి క్లారిటీ..

Friday, December 5, 2025

పాన్ ఇండియా రేంజ్‌లో Rebel స్టార్ ప్రభాస్ చేస్తున్న తాజా హారర్ ఫాంటసీ చిత్రం ‘ది రాజా సాబ్’. ఈ సినిమాతో దర్శకుడు మారుతి, కొత్త జానర్‌ను టచ్ చేస్తూ భిన్నమైన ప్రయత్నం చేశారు. తాజాగా ఈ సినిమా టీజర్‌ను ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చారు. టీజర్ చూస్తేనే సినిమా ఓ రేంజ్‌లో ఉండబోతోందని స్పష్టమవుతోంది. విజువల్స్, బీజీఎం, కథ నెరేషన్ అన్నీ బాగా క్యాచీగా ఉండటంతో, ఫ్యాన్స్‌లో భారీ ఎక్స్పెక్టేషన్స్ క్రియేట్ అయ్యాయి.

ఇక టీజర్ రాకతో పాటు, ఈ సినిమాకు సీక్వెల్ ఉంటుందా అనే క్వశ్చన్ కూడా తెరపైకి వచ్చింది. దీనిపై దర్శకుడు మారుతి స్పష్టత ఇచ్చారు. ప్రస్తుతం ఫోకస్ మొత్తం ఫస్ట్ పార్ట్ మీదే ఉంది, కథను జాగ్రత్తగా నడిపిస్తున్నాం. అసలే కథ బాగుంది కాబట్టి, ఉద్దేశపూర్వకంగా అతి చేసుకుంటూ పార్ట్ 2 ప్లాన్ చేయాలనే ఉద్దేశం లేదని ఆయన తెలిపారు. కథ పూర్తయ్యాక పరిస్థితిని బట్టి చూస్తాం అన్నట్టుగా ఆయన సూచించారు.

మరొకవైపు సినిమా కోసం యూనిట్ చాలా కష్టపడింది. సాధారణంగా షూటింగ్ డేస్‌లో 8 గంటలు వర్క్ చేయడం కామన్. కానీ ఈ ప్రాజెక్ట్ కోసం రోజుకు 18 గంటలు కూడా పని చేశామని మారుతి తెలియజేశారు. అలాంటి డెడికేషన్‌ వల్లే కంటెంట్ బాగా వచ్చిందని అభిప్రాయపడ్డారు.

ఈ సినిమాలో మాళవిక మోహనన్, నిధి అగర్వాల్, రిద్ధి కుమార్‌ లాంటి గ్లామరస్ హీరోయిన్లు నటిస్తున్నారు. భారీ బడ్జెట్‌తో రూపొందుతోన్న ఈ సినిమాను పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్‌పై టి.జి. విశ్వ ప్రసాద్ నిర్మిస్తున్నారు. ఇప్పటికే టీజర్‌కు వచ్చిన రెస్పాన్స్‌ని బట్టి చూస్తే, సినిమా విడుదలయ్యేలోపు ఈ ప్రాజెక్ట్‌పై హైప్ ఇంకా పెరిగే అవకాశాలు ఉన్నాయి.

Related Articles

  !!!!!!!!   Hiring content writers   !!!!!!!!!
Contact us : [email protected]

Latest Articles