ప్రభాస్ హీరోగా, నిధి అగర్వాల్, మాళవిక మోహనన్, రిద్ధి కుమార్ హీరోయిన్స్ గా నటిస్తున్న సినిమా “ది రాజా సాబ్” కోసం అభిమానుల్లో పెద్ద అంచనాలు నెలకొన్నాయి. మారుతీ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రం హారర్-ఫాంటసీ జోనర్ లో సాలిడ్ ఎంటర్టైనర్ గా రూపొందుతోంది.
సినిమా షూటింగ్ పూర్తి వేగంగా జరుగుతూనే ఉంది. ఇటీవలే పాటల కోసం ప్రత్యేక షెడ్యూల్ కూడా మొదలైంది. తాజాగా గ్రీస్ లోని షూటింగ్ సెట్స్ నుండి దర్శకుడు మేకర్స్ కి లైవ్ అప్‌డేట్ ఇచ్చారు. ఈ సందర్భంలో ప్రభాస్ “రాజా సాబ్” టి షర్ట్ లో కనిపించడం ఫ్యాన్స్ ని మరింత ఉత్సాహపరిచింది. ఈ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.
