పెళ్లి చేసుకున్న చరణ్‌ ముద్దుగుమ్మ!

Friday, December 5, 2025

అటు టాలీవుడ్‌, హాలీవుడ్‌ లో వరుస సినిమాల్లో నటిస్తూ ఫుల్‌ బిజీగా ఉన్న నటి అమీ జాక్సన్‌ గురించి అందరికీ తెలిసిందే. ఈ ముద్దుగుమ్మ గత కొంత కాలంగా హాలీవుడ నటుడు ఎడ్‌ వెస్ట్‌ విక్‌ తో ప్రేమాయణం నడుపుతున్న సంగతి తెలిసిందే. తాజాగా అమీ తన ప్రియుడితో కలిసి వైవాహిక జీవితాన్ని ప్రారంభించింది.

వీరి పెళ్లి వేడుక ఇటలీలో ఘనంగా జరిగింది. సోషల్‌ మీడియా వేదికగా ఇరువురు తమ వెడ్డింగ్‌ పిక్స్‌ ను షేర్‌ చేసుకున్నారు. అమీ జాక్సన్‌ తమ చిత్రాలను పోస్ట్‌ చేస్తూ.. ‘కొత్త ప్రయాణం ఇప్పుడే మొదలైంది..’ అంటూ ఓ కాప్షన్ కూడా ఇచ్చింది. ఐతే, గతంలో జార్జ్‌ పనియోటౌ అనే వ్యాపారవేత్తతో అమీ జాక్సన్‌ కొంతకాలం సహజీవనం చేసిన సంగతి తెలిసిందే.

కొంతకాలం తర్వాత ఆ జంట పెళ్లి కూడా చేసుకుని  ఆండ్రూ అనే బాబుకి  జన్మ కూడా ఇచ్చారు. ఆ తర్వాత అమీ-జార్జ్‌ మధ్య మనస్పర్థలు రావడంతో ఇద్దరు విడిపోయారు. ఆ ప్రయాణం అలా ముగిసింది. ఇప్పుడు అమీ జాక్సన్‌ హాలీవుడ్‌ నటుడు ఎడ్‌ వెస్ట్‌విక్‌ తో తన ‘కొత్త ప్రయాణాన్ని ప్రారంభించింది. మరి ఈ ప్రయాణం ఎన్నాళ్ళు సాగుతుందో చూడాల్సిందే. కాగా రామ్ చరణ్ మూవీ ‘ఎవడు’తో పాటు, ‘ఐ’, ‘2. ఓ’ తదితర చిత్రాలలో అమీ జాక్సన్‌ నటించి తెలుగు ప్రేక్షకులకు దగ్గరయ్యింది.

Related Articles

  !!!!!!!!   Hiring content writers   !!!!!!!!!
Contact us : [email protected]

Latest Articles