మార్ ముంతా చోడ్ చింతా సాంగ్‌ ప్రొమో వచ్చేసింది!

Andhrawatch
1 Min Read

ఇస్మార్ట్ శంకర్ బ్లాక్ బస్టర్ హిట్‌ తరువాత ఎనర్జిటిక్ స్టార్, హీరో రామ్ పోతినేని, డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాధ్ డబుల్ ఇస్మార్ట్ తో మళ్లీ ప్రేక్షకుల రాబోతున్న సంగతి తెలిసిందే. బాలీవుడ్ నటుడు సంజయ్ దత్‌ ఈ సినిమాలో విలన్ పాత్రలో చేస్తున్న సంగతి తెలిసిందే. ఆగస్ట్ 15, 2024 న వరల్డ్ వైడ్ గా థియేటర్లలో విడుదల కాబోతున్న ఈ సినిమాపై ప్రేక్షకుల్లో, అభిమానుల్లో భారీ అంచనాలు ఏర్పడ్డాయి.

ఈ సినిమా నుండి ఇప్పటికే ఫస్ట్ సింగిల్ అయిన స్టెప్పా మార్ ను విడుదల చేయగా, సూపర్ రెస్పాన్స్ ను అందుకున్న విషయం తెలిసిందే.ఇప్పుడు ఈ చిత్రం నుండి మార్ ముంతా చోడ్ చింతా సాంగ్ కి సంబంధించిన ప్రోమో ను రిలీజ్ చేశారు. ఈ సాంగ్ పక్కా మాస్ సాంగ్ అని తెలుస్తోంది. ఈ సాంగ్ కూడా ఎనర్జిటిక్ గా అనిపిస్తుంది.

పూర్తి పాట రేపు సాయంత్రం 4:00 గంటలకు రిలీజ్ కానున్నట్లు ప్రోమోలో చిత్ర బృందం తెలిపింది. మెలోడీ బ్రహ్మ మణిశర్మ సంగీతం అందిస్తున్న ఈ మూవీలో కావ్య థాపర్ హీరోయిన్ గా చేస్తుంది. ఈ చిత్రాన్ని పూరి జగన్నాథ్, ఛార్మి కౌర్ లు సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఇస్మార్ట్ శంకర్ తరహాలో ఈ చిత్రం కూడా బ్లాక్ బస్టర్ హిట్ ను సాధిస్తుంది అని చిత్ర యూనిట్‌ ఆశాభావం వ్యక్తం చేస్తుంది.

Share This Article