“మార్ ముంతా చోడ్ చింతా” సాంగ్ ను సీటీ కొట్టడం గ్యారెంటీ!

Thursday, January 2, 2025

ఇస్మార్ట్ శంకర్ బ్లాక్ బస్టర్ తర్వాత ఎనర్జిటిక్ స్టార్, హీరో రామ్ పోతినేని, డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్‌ డబుల్ ఇస్మార్ట్ తో మళ్లీ ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. బాలీవుడ్ నటుడు సంజయ్ దత్‌ ఇందులో విలన్ పాత్రలో నటిస్తున్న సంగతి తెలిసిందే. ఆగస్ట్ 15, 2024 న వరల్డ్ వైడ్ గా థియేటర్లలో ఈ సినిమా సందడి చేయబోతున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా పై  ప్రేక్షకుల్లో, అభిమానుల్లో భారీ అంచనాలు ఏర్పడ్డాయి. రిలీజ్ డేట్ దగ్గర పడుతుండటంతో మూవీ మేకర్స్ ప్రమోషన్స్ ను వేగవంతం చేశారు మూవీ టీం. ఇప్పటికే సినిమా నుండి విడుదలైన ప్రచార చిత్రాలకి, పాటలకు సూపర్ రెస్పాన్స్ వచ్చిన సంగతి తెలిసిందే.

మార్ ముంతా చోడ్ చింతా సాంగ్ కి ఆడియెన్స్ నుండి మంచి రెస్పాన్స్ వస్తోంది మెలోడీ బ్రహ్మ మణిశర్మ అద్దిరిపోయే మ్యూజిక్ అందించగా, రామ్ డాన్స్ ఇరగదీసిన సంగతి తెలిసిందే. ఈ సాంగ్ పై డైరెక్టర్ పూరీ జగన్నాథ్ పలు ఆసక్తికర కామెంట్స్‌ చేశారు. ఇస్మార్ట్ శంకర్ లో ధిమాక్ కరాబ్ సాంగ్ చాలా పెద్ద హిట్ అయిన సంగతి తెలిసిందే. అదే రేంజ్ లో పార్ట్ లో సాంగ్ రావాలంటే చాలా కష్టపడాల్సి ఉంటుంది. మణి గారు ఈ సాంగ్ కోసం చాలా కష్టపడ్డారు. దాని కంటే బాగుండాలి, దాన్ని మర్చిపోవాలి అని, ఇస్మార్ట్ శంకర్ లో మార్ ముంతా చోడ్ చింత డైలాగ్ ఉంది.

ఇది తెలంగాణలో చాలా ఫేమస్. ఆ డైలాగ్ ను వాడి మేము సాంగ్ ను చేసేశాం. . ఫస్ట్ టైం విజయ్ మాస్టర్ తో వర్క్ చేశాం. రామ్ స్టెప్స్ మాములుగా వెయ్యలేదు. రామ్ కోసం డిఫరెంట్ స్టెప్స్ కంపోజ్ చేశారు. అందరికీ తెలుసు రామ్ వెరీ గుడ్ డ్యాన్సర్. హీరోయిన్ కావ్య థాపర్ కూడా రామ్ పక్కన చాలా బాగా నటించింది. ఈ సాంగ్, సింగిల్ స్క్రీన్ లో సీటీలు వేస్తూ చూడాల్సిన పాట, త్వరలో మీరు ఎంజాయ్ చేస్తారు అంటూ  పూరి జగన్నాథ్‌ చెప్పుకొచ్చారు.

Related Articles

  !!!!!!!!   Hiring content writers   !!!!!!!!!
Contact us : [email protected]

Latest Articles