కూతురు పుట్టిన రోజు సందర్బంగా భారీ విరాళం ప్రకటించిన మంచువారబ్బాయి!

Monday, January 20, 2025

మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ (మా) అధ్యక్షుడు విష్ణు మంచు తన కూతురు ఐరా విద్య మంచు పుట్టిన రోజును పురస్కరించుకుని  పది లక్షల విరాళాన్ని ప్రకటించారు. మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్‌లో ఆర్థికంగా వెనుకబడిన నటీనటుల సంక్షేమం కోసం మంచు విష్ణు పది లక్షలు విరాళంగా అందజేశారు.

నటీనటులకు సహాయం చేయడం, వారికి అవసరమైన సపోర్ట్, సంరక్షణ అందేలా చేయడం కోసం ఈ మొత్తాన్ని వెచ్చించనున్నామని ఆయన టీం ప్రకటించింది. గత మూడు సంవత్సరాలలో మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ విష్ణు నాయకత్వంలో అద్భుతమైన అభివృద్ధి సాధించింది. మా భవనంపై విష్ణు మంచు ఫోకస్ పెట్టడమే కాకుండా మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ మెంబర్లు, సినీ ఆర్టిస్టుల మీద సోషల్ మీడియాలో వచ్చే అసత్య కథనాలు, ట్రోలింగ్‌ కట్టడి చేసేందుకు విష్ణు నడుంబిగించారు.

నటీనటులు వారి కుటుంబాలను లక్ష్యంగా చేసుకుని కొంతమంది యూట్యూబర్‌లు పోస్ట్ చేసిన అసభ్యకరమైన, అవమానకరమైన కంటెంట్‌ను తీయించడంలో ప్రముఖ పాత్ర పోషించారు. విష్ణు చేపట్టిన ఈ చర్యలను ఇతర ఇండస్ట్రీలకు చెందిన ఆర్టిస్టులు కూడా ప్రశంసించారని టీం పేర్కొంది.

Related Articles

  !!!!!!!!   Hiring content writers   !!!!!!!!!
Contact us : [email protected]

Latest Articles