మిరాయ్‌ సెట్స్ లోకి మంచు వారబ్బాయి!

Sunday, December 22, 2024

ఈ ఏడాది హనుమాన్ సినిమాతో భారీ విజయాన్ని తన ఖాతాలో వేసుకున్న యంగ్‌ అండ్‌ టాలెంటెడ్‌ హీరో తేజా సజ్జా. ఈ సినిమా తరువాత తేజా మిరాయ్‌ చిత్రంలో ప్రధాన పాత్రలో నటిస్తున్నారు.  ఈ చిత్రం నుండి రిలీజైన టైటిల్ గ్లింప్స్ వీడియో ఆడియెన్స్ ను విశేషం గా ఆకట్టుకున్న సంగతి తెలిసిందే.

 కార్తీక్ ఘట్టమనేని దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో రితికా నాయక్ కథానాయికగా చేస్తోంది. ఈ సినిమాలో మంచు మనోజ్ విలన్‌గా నటిస్తున్న సంగతి చిత్ర బృందం ప్రకటించిన సంగతి తెలిసిందే.

తాజా విశేషం ఏంటంటే..మంచు మనోజ్ ఇటీవలే మిరాయ్ సెట్స్‌లో జాయిన్ అయ్యాడు. ఈ  విషయాన్ని మనోజ్‌ పరోక్షంగా తన సోషల్ మీడియా ఖాతాలో  ప్రకటించాడు. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్‌పై టీజీ విశ్వ ప్రసాద్ నిర్మిస్తున్న ఈ చిత్రంలో దుల్కర్ సల్మాన్ గెస్ట్ రోల్ లో చేయనున్నట్లు  సమాచారం. ఈ సినిమా ఏప్రిల్ 18, 2025న 7 భాషల్లో  గ్రాండ్ గా  విడుదల కానుంది.

Related Articles

  !!!!!!!!   Hiring content writers   !!!!!!!!!
Contact us : [email protected]

Latest Articles