జ్వాలగా రాబోతున్న మంచు లక్ష్మి!

Wednesday, January 22, 2025

మంచు లక్ష్మీ  నటిగా ఫుల్‌ బిజీగా ఉంటున్నారు. ఇప్పటికే ఆమె నటించిన ‘ఆదిపర్వం’ సినిమా త్వరలోనే విడుదలకు సిద్ధమవుతుండగా, తాజాగా ఆమె నటిస్తోన్న సోషియో ఫాంటసీ వెబ్ సిరీస్‌ నుంచి మేకర్స్ ఆమె తాజా లుక్‌ని విడుదల చేశారు. దీంతో మంచు లక్ష్మీ.. ప్రస్తుతం టాక్ ఆఫ్ ద టాలీవుడ్‌గా అయ్యింది. ఆర్కా మీడియా వర్క్స్ , డిస్నీ ఫ్లస్ హాట్ స్టార్ కాంబోలో రూపుదిద్దుకుంటోన్న ఓ ఇంట్రెస్టింగ్ వెబ్ సిరీస్ ‘యక్షిణి.’

ఈ వెబ్ సిరీస్‌ను ‘బాహుబలి’ సిరీస్ చిత్రాల నిర్మాతలు శోభు యార్లగడ్డ, ప్రసాద్ దేవినేని నిర్మిస్తున్నారు. వేదిక, మంచు లక్ష్మి, రాహుల్ విజయ్, అజయ్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. ‘కోటబొమ్మాళి పిఎస్’  ఫేమ్ దర్శకుడు తేజ మార్ని ఈ ‘యక్షిణి’ వెబ్ సిరీస్‌ను రూపొందిస్తున్నారు. ఇందులో మంచు లక్ష్మీ పాత్రను పరిచయం చేస్తూ.. తాజాగా ఆమె లుక్‌ని చిత్ర బృందం విడుదల చేశారు. ఇందులో మంచు లక్ష్మీ మిస్టీరియస్ జ్వాల గా కనిపించనున్నారు. ఈ వెబ్ సిరీస్ నుంచి మంచు లక్ష్మి నటించిన జ్వాల క్యారెక్టర్‌ను పరిచయం చేస్తూ విడుదల చేసిన పోస్టర్ ప్రస్తుతం వైరల్ అవుతోంది.

ఈ పోస్టర్‌లో మంచు లక్ష్మీ చీరకట్టులో చాలా అందంగా కనిపిస్తోంది. వెనుక బ్యాక్‌గ్రౌండ్ చూస్తుంటే.. ఆమెది ఇందులో పవర్ ఫుల్ పాత్ర అనేది అర్థమవుతోంది.

Related Articles

  !!!!!!!!   Hiring content writers   !!!!!!!!!
Contact us : [email protected]

Latest Articles