అలరిస్తున్న విక్రమ్ “తంగలాన్” నుండి మనకి మనకి సాంగ్!

Saturday, December 21, 2024

కోలీవుడ్ స్టార్ యాక్టర్ చియాన్ విక్రమ్  ప్రధాన పాత్రలో, స్టార్ డైరెక్టర్ పా. రంజిత్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న మూవీ తంగలాన్ . ప్రస్తుతం నిర్మాణ దశలో ఉన్న ఈ మూవీ… కోలార్‌ గోల్డ్‌ ఫీల్డ్స్‌లో జరిగిన కొన్ని నిజ జీవిత సంఘటనల ఆధారంగా రూపుదిద్దుకుంటుంది. ఇప్పటికే సినిమా నుండి విడుదలైన ప్రచార చిత్రాలకి ప్రేక్షకుల నుండి, అభిమానుల నుండి మంచి టాక్‌ వచ్చింది.

చిత్ర బృందం విడుదల చేసిన  ట్రైలర్ సినిమాపై మరింత ఆసక్తిని పెంచింది. బుధవారం ఫస్ట్ సింగిల్ ”మనకి మనకి” సాంగ్ ను చిత్ర బృందం విడుదల  చేశారు. ఈ పాట ఆడియెన్స్ ను బాగా అలరిస్తోంది. తమిళంలో మాత్రమే కాకుండా, తెలుగు, హిందీ, మలయాళం, కన్నడ భాషల్లో కూడా విడుదల  కానున్న ఈ సినిమాకి జీవీ ప్రకాష్ కుమార్ సంగీతం సమకూరుస్తున్నారు. మాళవిక మోహనన్ ఫీమేల్ లీడ్ రోల్ లో నటిస్తున్న ఈ మూవీని స్టూడియో గ్రీన్ పతాకంపై నిర్మిస్తున్నారు. ఈ చిత్రానికి సంబంధించిన మరిన్ని వివరాలు త్వరలో బయటకు రానున్నట్లు సమాచారం.

Related Articles

  !!!!!!!!   Hiring content writers   !!!!!!!!!
Contact us : [email protected]

Latest Articles