క్రేజీ టాక్‌ ఏంటంటే!

Saturday, March 22, 2025

క్రేజీ టాక్‌ ఏంటంటే! టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా ప్రియాంక చోప్రా జోన్స్ అలాగే పృథ్వీ రాజ్ సుకుమారన్ లాంటి స్టార్స్ కలయికలో దర్శక దిగ్గజం ఎస్ ఎస్ రాజమౌళి తెరకెక్కిస్తున్న భారీ చిత్రం కోసం అందరికీ తెలిసిందే. మరి మహేష్ బాబు కెరీర్లో 29వ సినిమాగా దీనిని మేకర్స్ తెరకెక్కిస్తుండగా భారీ హైప్ దీనిపై ప్రపంచ వ్యాప్తంగా నెలకొంది.

RRR లాంటి గ్లోబల్ సెన్సేషన్ తర్వాత జక్కన్న నుంచి వస్తున్న సినిమా కావడంతో ప్రపంచమే ఎదురు చూస్తున్న ఈ సినిమా షూటింగ్ ఇపుడు మన దేశంలో జరుగుతుంది. అయితే ఈ షూట్ పై ఇంట్రెస్టింగ్ టాక్ ఒకటి తెలుస్తుంది. జక్కన్న ఈ చిత్రాన్ని స్టార్ట్ చేయడం ఆలస్యంగా చేసినప్పటికీ షూటింగ్ మాత్రం జెట్ స్పీడ్ లో జరుగుతుందట.

అంతే కాకుండా అనుకున్న సమయం కంటే షూటింగ్ కంప్లీట్ అయ్యిపోతుందట. దీనితో రెండు భాగాల షూటింగ్ కూడా ఇదే స్పీడ్ లో జరగనుంది అని తెలుస్తుంది. మరి ప్రస్తుతానికి ఈ సినిమాని మేకర్స్ 2027 కి మొదటి భాగాన్ని రిలీజ్ కి ప్లాన్ చేస్తున్న సంగతి తెలిసిందే.

Related Articles

  !!!!!!!!   Hiring content writers   !!!!!!!!!
Contact us : admin@andhrawatch.com

Latest Articles