సితార ఎంటర్టైన్ మెంట్‌ లో మహేష్‌ మేనల్లుడు!

Wednesday, January 22, 2025

గల్లా అశోక్‌ తన తరువాత చిత్రాన్ని సితార  ఎంటర్‌టైన్‌మెంట్స్ తో చేయబోతున్నట్లు సమాచారం. సితార పతాకంపై ప్రొడక్షన్ నెం.27 గా ఈ చిత్రం రూపుదిద్దుకుంటుంది. ఏప్రిల్ 5న అశోక్ గల్లా పుట్టినరోజు సందర్భంగా ఈ చిత్రం గురించి అధికారికంగా ప్రకటించారు.  ప్రేమ, హాస్యం మేళవింపుతో ఈ తరం మెచ్చే అందమైన కథతో  ఈ సినిమా రాబోతున్నట్లు చిత్ర బృందం వెల్లడించింది.

 చిత్ర ప్రకటనకు సంబంధించి విడుదల చేసిన పోస్టర్‌ ను బట్టి చూస్తే.. ఈ  కథ అమెరికాలో సాగుతుందని అర్థమవుతోంది. ‘ది స్టాచ్యూ ఆఫ్ లిబర్టీ’తో కూడిన పోస్టర్ డిజైన్  ప్రేక్షకుల్ని ఆకట్టుకుంటోంది. “హ్యాపీ బర్త్‌డే అశోక్” అంటూ పుట్టినరోజు శుభాకాంక్షలు తెలుపుతూ ఈ పోస్టర్‌ ను విడుదల చేసింది.

‘లవర్‌’లో తన నటనతో విమర్శకుల, ప్రేక్షకుల ప్రశంసలు అందుకున్న ‘మ్యాడ్’ మూవీ ఫేమ్ శ్రీ గౌరీ ప్రియ ఈ చిత్రంలో హీరోయిన్‌ గా నటిస్తోంది. ఉద్భవ్ ఈ చిత్రంతో దర్శకుడిగా పరిచయం అవుతున్నాడు.  ఎన్నో హిట్‌ చిత్రాలను అందించిన సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ సంస్థ నిర్మిస్తోంది.  సూర్యదేవర నాగ వంశీ, సాయి సౌజన్య ఈ సినిమాకి నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు.  ఈ సినిమాకి సంబంధించిన పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది.

Related Articles

  !!!!!!!!   Hiring content writers   !!!!!!!!!
Contact us : [email protected]

Latest Articles