ప్రస్తుతం భారతీయ సినిమా స్థాయిని ప్రపంచానికి పరిచయం చేసే ప్రాజెక్టులలో ఒకటిగా చెప్పదగిన చిత్రం సూపర్ స్టార్ మహేష్ బాబు మరియు దర్శక దిగ్గజుడు ఎస్‌ఎస్ రాజమౌళి కాంబినేషన్‌లో తెరకెక్కుతోంది. మహేష్ బాబు కెరీర్‌లో 29వ చిత్రంగా రూపుదిద్దుకుంటున్న ఈ సినిమా కోసం ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. భారీ బడ్జెట్‌తో, అంతర్జాతీయ స్థాయి టెక్నికల్ విలువలతో ఈ సినిమా రూపొందుతోంది. నవంబర్ నెలలో ఈ ప్రాజెక్ట్ నుంచి ఏదో ప్రత్యేకమైన అప్‌డేట్ రాబోతోందనే వార్తలు ఇప్పటికే సినిమా వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారాయి.
ఇక ఈ చిత్రానికి సంబంధించిన టైటిల్‌పై కూడా గాసిప్‌లు జోరుగా నడుస్తున్నాయి. కొన్ని సినీ వర్గాల ప్రకారం ఈ చిత్రానికి “వారణాసి” అనే పేరు పరిశీలనలో ఉందని చెబుతున్నారు. అంతేకాకుండా సెట్స్ డిజైన్‌లు కూడా వారణాసి వాతావరణాన్ని గుర్తు చేసేలా ఉన్నాయన్న సమాచారం బయటకు వచ్చింది. దీంతో ఈ టైటిల్‌పై మరింత ఊహాగానాలు పెరిగాయి.
అయితే రాజమౌళి వంటి దర్శకుడు ఇంత సులభంగా టైటిల్‌ను ఫిక్స్ చేస్తారా అనే ప్రశ్న కూడా అభిమానుల్లో వినిపిస్తోంది. మరోవైపు “గ్లోబ్ ట్రాటర్” అనే పేరు కూడా కొంతమంది చర్చలోకి తెచ్చారు, అది సినిమా గ్లోబల్ థీమ్‌కు తగ్గట్టు ఉంటుందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.
