మహేష్‌- రాజమౌళి సినిమా విడుదల ఎప్పుడంటే!

Sunday, December 22, 2024

టాలీవుడ్ సూపర్‌ స్టార్‌ మహేష్‌ బాబు దర్శక ధీరుడు రాజమౌళి దర్శకత్వంలో ఓ సినిమాని చేస్తున్న విషయం తెలిసిందే. ఈ సినిమా స్క్రిప్ట్‌ రాజమౌళి తండ్రి విజయేంద్ర ప్రసాద్‌ ఇప్పటికే పూర్తి చేసిన విషయం తెలిసిందే. ఈ సినిమాని దుర్గ ఆర్ట్స్ బ్యానర్ పై కె.ఎల్.నారాయణ ఈ స నిర్మిస్తున్నారు.

ఈ సినిమా భారీ బడ్జెట్ తో బిగ్గెస్ట్ పాన్ వరల్డ్ మూవీగా తెరకెక్కుతుంది .ప్రస్తుతం ఈ సినిమాకు సంబంధించి ప్రీ ప్రొడక్షన్ వర్క్ జరుగుతుంది. త్వరలోనే ఈ మూవీ రెగ్యులర్ షూటింగ్ మొదలు కానుంది. ఈ సినిమాలో మలయాళం స్టార్ హీరో పృధ్వి రాజ్ సుకుమారన్ కీలక పాత్ర పోషిస్తున్నారని గత కొంతకాలంగా ఓ వార్త నెట్టింట హల్‌చల్‌ చేస్తుంది.

ఇదిలా ఉంటే ఈ సినిమాకు సంబంధించి ఓ ఇంట్రెస్టింగ్ న్యూస్ బాగా వైరల్ గా మారింది. ఆఫ్రికన్ అడ్వెంచరస్ యాక్షన్ డ్రామాగా తెరకెక్కనున్న ఈ సినిమాలో ఎక్కువ భాగం అమెజాన్ అడవుల్లో షూటింగ్ చేస్తున్నారంట. అయితే ఈ సినిమాలో కొన్ని కీలక సన్నివేశాలు చిత్రీకరణకు రామోజీ ఫిలిం సిటీలో 100 కోట్ల రూపాయలతో భారీ సెట్ వేశారు. 

Related Articles

  !!!!!!!!   Hiring content writers   !!!!!!!!!
Contact us : [email protected]

Latest Articles