డైనమిక్‌ లుక్‌ లో అదిరిన మహేష్‌ బాబు!

Thursday, April 3, 2025

ప్రస్తుతం తెలుగు సినిమా ప్రేక్షకులతో సహా ప్రపంచ సినీ ప్రేమికులు కూడా ఎంతగానో ఎదురు చూస్తున్న పాన్‌ ఇండియన్‌ సినిమా ఏదన్నా ఉంది అంటే అది సూపర్‌ స్టార్‌ మహేష్‌ బాబు , దర్శకు ధీరుడు ఎస్‌ఎస్‌ రాజమౌళి కాంబోలో రాబోతున్న సినిమా అనే చెప్పవచ్చు. మరి ఈ భారీ చిత్రం మహేష్ బాబు కెరీర్ లో 29వ సినిమాగా రాబోతుండగా ఎన్నో అంచనాలు నెలకొన్నాయి.

అయితే ఈ సినిమా షూటింగ్ మొదలు కావడానికి ముందు చిత్ర బృందం కొంచెం గ్యాప్ తీసుకొని అంతా సెట్ చేస్తుండగా ఈలోపు మహేష్ బాబు కూడా కొత్త లుక్ లోకి మారడం మొదలు పెట్టాడు. అయితే ఈ సినిమా కోసం తాను ప్రిపేర్ చేస్తున్న లేటెస్ట్ లుక్స్ కి మహేష్ అభిమానులు అయితే తెగ సంబరపడిపోతున్నారు.

గడ్డం పెంచుతూ లాంగ్ హెయిర్ లో ఒక డైనమిక్ లుక్ తో అయితే మహేష్ కనిపిస్తుండగా ఇది ఇప్పుడు ఫ్యాన్స్ లో కొత్త జోష్‌ ని నింపుతుంది. 

Related Articles

  !!!!!!!!   Hiring content writers   !!!!!!!!!
Contact us : admin@andhrawatch.com

Latest Articles