టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా దర్శక దిగ్గజం ఎస్ ఎస్ రాజమౌళి కలయికలో తెరకెక్కిస్తున్న భారీ చిత్రం కోసం అందరికీ తెలిసిందే. దీనిపై మాత్రం గ్లోబల్ లెవెల్ హైప్ ఉంది. మహేష్ కెరీర్లో 29వ సినిమాగా అనేకమంది స్టార్ నటీనటులు సమాహారంతో జక్కన్న తెరకెక్కిస్తున్న ఈ సాలిడ్ అడ్వెంచర్ థ్రిల్లర్ పట్ల ఇపుడు అంతకంతకు అంచనాలు పెరుగుతూ వెళుతున్నాయి.
ఇక ఇదిలా ఉండగా ఈ బిగ్ ప్రాజెక్ట్ రిలీజ్ పై ఇపుడు ఓ డేట్ వైరల్ గా మారింది. ఈ చిత్రాన్ని మేకర్స్ రానున్న 2027 ఏడాదిలో మార్చ్ 25న ప్రపంచ వ్యాప్తంగా విడుదల చేయాలని లాక్ చేసినట్టుగా స్ట్రాంగ్ బజ్ వినపడుతుంది. ప్రస్తుతానికి ఆ డేట్ నే టార్గెట్ గా పెట్టుకొని సినిమా పనులు కంప్లీట్ చేస్తున్నారట. మరి దీనిపై మరింత క్లారిటీ బయటకి రావాల్సి ఉంది.