Mahesh Babu: సూపర్ స్టార్‌ అంటే ఆ మాత్రం ఉండాల్సిందే మరి..మహేషా..మజాకా!

Sunday, December 22, 2024

సూపర్ స్టార్‌ అంటే ఆ మాత్రం ఉండాల్సిందే మరి..మహేషా..మజాకా!

సూపర్‌ స్టార్‌ మహేష్‌ బాబు అందం గురించిఎంత చెప్పినా తక్కువే. ఇండస్ట్రీలో సంవత్సరాలు గడుస్తున్న కొద్ది వయసు పెరుగుతుంది కానీ.. మహేష్‌ బాబు అందం మాత్రం రోజురోజుకి పెరుగుతూనే ఉంది. నిన్నకాక మొన్న ఇండస్ట్రీకి వచ్చిన హీరోలు కూడా చాలా మంది తండ్రి పాత్రలకు మారిపోతున్న మహేష్‌ మాత్రం ఇంకా యంగ్‌ గా అవుతున్నారు.

ఈ ఏడాది మహేష్‌ గుంటూరు కారం సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడే కానీ ఆశించిన స్థాయిలో విజయాన్ని అందుకోలేకపోయాడు. ప్రస్తుతం మహేష్‌ దర్శకధీరుడు రాజమౌళి దర్శకత్వంలో ఎస్‌ఎస్‌ఎంబీ 29 సినిమాలో నటిస్తున్నాడు. అసలు రాజమౌళి సినిమా అంటేనే తక్కువలో తక్కువ ఓ రెండు సంవత్సరాలు వేసుకోవచ్చు.

అలాంటిది మహేష్‌ జక్కన్న మొదటిసారి జత కట్టబోతున్నారు. దీంతో మహేష్‌ అభిమానులు ఇప్పట్లో మహేష్‌ బాబును చూడలేమని ఫిక్స్‌ అయిపోయారు. కానీ మహేష్‌ బాబు మాత్రం ఫ్యాన్స్‌ కు అలాంటి టెన్షన్ లేకుండా చేస్తున్నాడు. ఎప్పటికప్పుడు తన తాజా చిత్రాలను సోషల్ మీడియాలో అప్‌లోడ్ చేస్తూ ఫ్యాన్స్‌ కి కనుల విందు చేస్తున్నాడు.

గత రెండు మూడు రోజుల నుంచి రోజుకో ఫొటో షేర్‌ చేస్తూ సోషల్ మీడియాను అదరగొడుతున్నాడు. నిన్నటికి నిన్న ఓ బ్లాక్ సూట్ లో ఉన్న ఫొటోను షేర్‌ చేస్తే అది కాస్త సోషల్‌ మీడియాలో వైరల్‌ గా మారింది. అది అలా ఉంటే చెక్స్‌ షర్ట్ గాగుల్స్‌ చెదిరిన జుట్టుతో మరింత అందంగా కనిపించాడు.

అసలు మహేష్‌ పక్కన హాలీవుడ్‌ హీరోలు కూడా ఏ మాత్రం పనికిరారు అన్నంత అందంగా ఉన్నాడు. దీంతో అభిమానులు ఏ హాలీవుడ్‌ హీరో అయినా మా సూపర్‌ స్టార్‌ పక్కన పనికిరాడు అంటూ కామెంట్లు పెడుతున్నారు.

Related Articles

  !!!!!!!!   Hiring content writers   !!!!!!!!!
Contact us : [email protected]

Latest Articles