భీమవరం టాకీస్ నిర్మాణంలో మరో ఆసక్తికరమైన ప్రాజెక్ట్ “మహానాగ” రెగ్యులర్ షూటింగ్ మొదలైంది. ఇటీవలే ఒకేసారి 15 సినిమాల ప్రారంభంతో అందరినీ ఆశ్చర్యపరిచిన ఈ బ్యానర్ ఇప్పుడు ఆ చిత్రాల్లో ఒకదైన మహానాగ చిత్రాన్ని సెట్స్‌పైకి తీసుకెళ్లింది. హైదరాబాద్‌లో జరిగిన ప్రారంభ దశ చిత్రీకరణలో హీరో రమాకాంత్, నూతన నాయిక శ్రావణి ముప్పిరాలు, సీనియర్ నటుడు సుమన్ పాల్గొన్నారు.
ఈ చిత్రానికి ముహూర్తపు సన్నివేశాలను చిత్రీకరించగా, నిర్మాతల మండలి అధ్యక్షుడు కె.ఎల్. దామోదర ప్రసాద్ క్లాప్ ఇచ్చి శుభారంభం చేశారు. ప్రముఖ దర్శకుడు రేలంగి నరసింహారావు గౌరవ అతిథిగా హాజరై టీమ్‌ను ఆశీర్వదించారు.
తుమ్మలపల్లి రామసత్యనారాయణ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఇందులో శ్రీకావ్య, టంగుటూరు రామకృష్ణ, బస్ స్టాప్ కోటేశ్వరరావు, జబర్దస్త్ అప్పారావు, సుబ్బలక్ష్మి, టి.ఆర్.ఎస్., ధీరజ అప్పాజీ, సంధ్య వర్షిణి వంటి నటులు ముఖ్య పాత్రల్లో కనిపించనున్నారు. మొదటి షెడ్యూల్ హైదరాబాద్‌లో పూర్తయ్యింది. ఇక రెండో షెడ్యూల్ తాడేపల్లిగూడెం పరిసర ప్రాంతాల్లో జరగనుంది.
