లేటెస్ట్ గా మన తెలుగు సినిమా దగ్గర ఉగాది కానుకగా రిలీజ్ కి వచ్చిన లేటెస్ట్ చిత్రాల్లో మ్యాడ్ స్క్వేర్ కూడా ఒకటి. యంగ్ అండ్ టాలెంటెడ్ హీరోలు నార్నె నితిన్, రామ్ నితిన్ అలాగే సంగీత్ శోభన్ లు ప్రధాన పాత్రల్లో దర్శకుడు కళ్యాణ్ శంకర్ తెరకెక్కించిన ఈ చిత్రం సాలిడ్ హైప్ నడుమ వరల్డ్ వైడ్ గా రిలీజ్ కి వచ్చింది. ఇక అనుకున్నట్టుగానే ఈ చిత్రం మేకర్స్ అంచనాలు రీచ్ అయ్యేలా తెలుగు రాష్ట్రాల్లో మొదటి రోజు భారీ నంబర్స్ అందుకుంటే ఇపుడు వరల్డ్ వైడ్ నెంబర్ ని మేకర్స్ రివీల్ చేశారు.
దీనితో ప్రపంచ వ్యాప్తంగా మ్యాడ్ స్క్వేర్ ఏకంగా 20 కోట్లకి పైగా గ్రాస్ ని అందుకోవడం అనేది విశేషం. 20.8 కోట్ల గ్రాస్ ని మ్యాడ్ స్క్వేర్ ఒక్క రోజులో రాబట్టినట్టుగా మేకర్స్ అధికారికంగా ప్రకటించారు. దీనితో ఆడియెన్స్ లో ఈ చిత్రానికి ఆదరణ ఏ లెవెల్లో ఉందో అర్ధం చేసుకోవచ్చు. ఇక డే 2 నంబర్స్ కూడా గట్టిగానే ఉండనున్నాయి. ఇక ఈ చిత్రానికి భీమ్స్ సంగీతం అందించగా సితార ఎంటర్టైన్మెంట్స్ అలాగే ఫార్చూన్ ఫోర్ సినిమాస్ వారు నిర్మాణం వహించిన సంగతి తెలిసిందే.