మా బాలయ్య బాబు బంగారం!

Andhrawatch
1 Min Read

నందమూరి నటసింహం బాలకృష్ణ ను కలవడానికి వచ్చి అభిమానితో కలిసి భోజనం చేసిన ఫోటోలు ప్రస్తుతం సోషల్‌ మీడియాలో వైరల్‌ గా మారాయి. ఓర్వకల్లు రాక్‌ గార్డెన్స్ లో బాలయ్య బాబు 107 వ సినిమా షూటింగ్‌ జరుగుతుంది. ఈ క్రమంలోనే బాలయ్య బాబును చూసేందుకు ఆదోనికి చెందిన అభిమాని సజ్జద్‌ ఆయనను చూసేందుకు వచ్చాడు.

షూటింగ్‌ జరుగుతుండగానే బాలయ్య బాబును కలిసి మాట్లాడాడు. ఈ క్రమంలో ఆ అభిమానితో కలిసి బాలకృష్ణ భోజనం చేశారు. సజ్జద్‌ మాట్లాడుతూ…తాను హీరో నందమూరి బాలకృష్ణకు వీరాభిమానని అందులో భాగంగానే ఈరోజు ఆయనను కలవడానికి రావడం జరిగిందన్నారు. అంతేకాకుండా ఆయనతో పాటు కలిసి భోజనం చేయడం చాలా సంతోషంగా ఉందన్నారు.

ప్రస్తుతం ఈ వీడియోలు సోషల్‌ మీడియాలో వైరల్‌ గా మారాయి. దీంతో ఈ వీడియోలను చూసిన నందమూరి అభిమానులు మా బాలయ్య బాబు బంగారం అంటూ కామెంట్లు పెడుతున్నారు.

Share This Article