టాలీవుడ్‌లో కొత్తదనం చూపించే దర్శకుల్లో వెంకీ అట్లూరి కూడా ఓ మంచి గుర్తింపు తెచ్చుకున్నవాడు. ప్రేమ కథలతో మొదలైన ఆయన ప్రయాణం, ఒక్కో సినిమాతో మరో లెవెల్‌కి వెళ్లింది. ఆ ప్రూఫ్‌గా చెప్పుకోవచ్చు లేటెస్ట్ హిట్ “లక్కీ భాస్కర్”ని. దుల్కర్ సల్మాన్ హీరోగా, మీనాక్షి చౌదరి హీరోయిన్‌గా నటించిన ఈ సినిమా ప్రేక్షకులని ఆకట్టుకొని మంచి హిట్ అందుకుంది.
ఈ సినిమాకి వచ్చిన స్పందన చూస్తేనే మరో భాగం వస్తుందేమో అనే ఉహాగానాలు అప్పుడే మొదలయ్యాయి. అయితే సినిమాలో అలాంటి సూచనలు ఏవీ చూపించలేదు. కానీ ఇప్పుడు ఈ విషయాన్ని డైరెక్ట్‌గా దర్శకుడే క్లారిటీ ఇచ్చాడు. ఇటీవల ఒక ఇంటర్వ్యూలో వెంకీ అట్లూరి లక్కీ భాస్కర్‌కు పార్ట్ 2 ప్లాన్ చేస్తున్నామని చెప్పాడు. ఇది విని ఆ సినిమా అభిమానులు ఖుషీ అవుతున్నారు.
ఇక వెంకీ అట్లూరి ప్రస్తుతం తమిళ స్టార్ హీరో సూర్యతో కలిసి ఒక ఫ్యామిలీ ఎంటర్టైనర్ రూపొందిస్తున్నాడు. ఈ ప్రాజెక్టు పూర్తి అయిన తర్వాతే లక్కీ భాస్కర్ సీక్వెల్‌పై పూర్తి ఫోకస్ పెడతారని తెలుస్తోంది. మొత్తానికి ఓ హిట్ స్టోరీకి సీక్వెల్ వస్తుండటం మరింత ఆసక్తికరంగా మారింది.
