ఈ ఏడాది టాలీవుడ్ లో వచ్చిన సూపర్ హిట్ సినిమాల్లో డైరెక్టర్ వెంకీ అట్లూరి యంగ్ అండ్ టాలెంటెడ్ హీరో దుల్కర్ సల్మాన్ తో చేసిన మనీ థ్రిల్లర్ సినిమా “లక్కీ భాస్కర్” కూడా ఒకటి. మరి అనుకున్న అంచనాలు అందుకుని అదరగొట్టిన ఈ సినిమా దుల్కర్ కెరీర్ లో మరో హైయెస్ట్ గ్రాసర్ గా కూడా ఉంది.
అయితే ఆడియెన్స్ కి ఆద్యంతం ఆనందం అందించిన ఈ చిత్రం ఇపుడు కొంప ముంచిందట.ఈ చిత్రాన్ని చూసిన నలుగురు యువ విద్యార్థులు లక్కీ భాస్కర్ లానే ఏదోకటి చేసి ధనవంతులుగా మారతాం అని ఎక్కడికి వెళుతున్నారో చెప్పకుండ ఇంటి నుంచి వెళ్లిపోయారు. మరో విషయం ఏంటంటే వీరు నలుగురూ కేవలం తొమ్మిదో తరగతి మాత్రమే చదువుతున్నారట. దీనితో ఈ సినిమా చూసి ప్రభావితం అయ్యిన వీరు బయటకి వెళ్లిపోయారట.
మరి విశాఖపట్నంకి చెందిన కిరణ్ కుమార్, రఘు ,చరణ్, తేజ, అలాగే కార్తీక్ అనే నలుగురు టీనేజ్ కుర్రాళ్ళు లక్కీ భాస్కర్ తాజాగా చూశారంట. ఇది చూసి ఆ హీరోలానే సంపాదించే మళ్ళీ వెనక్కి వస్తాం అని స్నేహితులకి చెప్పి పారిపోయారంట. దీనితో వీరు ఎక్కడికి వెళ్లారో కనిపెట్టే ప్రయత్నాలు జరుగుతున్నాయట. దీనితో ఇది ట్విస్ట్ గా మారింది.