డబ్బింగ్‌ మొదలు పెట్టిన లోకనాయకుడు!

Sunday, December 22, 2024

లోక‌నాయ‌కుడు క‌మ‌ల్ హాస‌న్ ఇటీవ‌ల ‘ఇండియ‌న్-2’  సినిమాతో ప్రేక్ష‌కుల ముందుకు వచ్చిన సంగతి తెలిసిందే. ఈ సినిమాను స్టార్ డైరెక్ట‌ర్ శంక‌ర్ తెర‌కెక్కించ‌డంతో అభిమానుల్లో భారీ అంచ‌నాలు క్రియేట్ అయ్యాయి. అయితే, ఈ సినిమా విడుదల  త‌రువాత ఆడియెన్స్ ను మెప్పించ‌డంలో మాత్రం బాగా ఫెయిల్‌ అయ్యారు. దీంతో ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద బోల్తా పడింది.

ఇక ఇప్పుడు క‌మ‌ల్ హాస‌న్ త‌న నెక్ట్స్ ప్రాజెక్ట్ పై ఫుల్‌ ఫోక‌స్ పెట్టాడు. క్లాసిక్ డైరెక్ట‌ర్ మ‌ణిర‌త్నం డైరెక్షన్‌ లో క‌మ‌ల్ న‌టిస్తున్న తాజా చిత్రం ‘థ‌గ్ లైఫ్’ ఇప్పటికే ఈ సినిమా షూటింగ్ ముగించుకుని పోస్ట్ ప్రొడ‌క్ష‌న్ ప‌నుల్లో బిజీగా ఉంది. తాజాగా ఈ సినిమాలోని త‌న పాత్ర కోసం క‌మ‌ల్ డ‌బ్బింగ్ మొద‌లుపెట్టాడు. దీనికి సంబంధించిన అప్డేట్ ను వీడియో రూపంలో చిత్ర బృందం విడుదల చేసింది.

‘థ‌గ్ లైఫ్’ చిత్రంలో క‌మ‌ల్ ఓ స‌రికొత్త లుక్ లో కనిపించబోతున్నాడు. ఈ సినిమాలో త్రిష‌, అభిరామి, ఐశ్వ‌ర్య లక్ష్మీ శింబు, పంక‌జ్ త్రిపాఠి, అలీ ఫ‌జ‌ల్, అశోక్ సెల్వ‌న్, జోజు జార్జ్, నాజ‌ర్, ఇత‌ర ముఖ్య పాత్ర‌లు చేస్తున్నారు. . ఈ సినిమాకు ఏఆర్.రెహ‌మాన్ సంగీతం సమకూరుస్తున్నాడు.

Related Articles

  !!!!!!!!   Hiring content writers   !!!!!!!!!
Contact us : [email protected]

Latest Articles