జానకిగా వస్తున్న లిల్లీ….!

Tuesday, January 21, 2025

టిల్లు స్క్వేర్‌ లో లిల్లిగా అనుపమ పరమేశ్వరన్‌ దూసుకుపోతుంది. ఆ సినిమా సక్సెస్ ను ఇంకా పూర్తిగా ఎంజాయ్ చేయకముందే అనుపమ మరో కొత్త సినిమాతో అభిమానుల ముందుకు రాబోతుంది.  మలయాళం సినిమా ‘జానకి వర్సెస్ స్టేట్ ఆఫ్ కేరళ’ పేరుతో త్వరలో ప్రేక్షకుల ముందుకు థియేటర్లలోకి రానుంది.

ఈ సినిమాలో అనుపమ కొత్త లుక్ లో అలరించబోతుంది. అనుపమ ఈ మధ్య కాలంలో  మలయాళ సినిమాలు చెయ్యలేదు. గత రెండు సంవత్సరాలుగా  తెలుగు సినిమాలు మాత్రమే చేస్తు వస్తుంది. దాదాపుగా రెండేళ్లు తర్వాత ఇప్పుడు  మలయాళంలోకి ఎంట్రీ ఇవ్వనుంది. కోర్ట్ రూమ్ డ్రామాగా ఈ మూవీ రాబోతున్నట్లు తెలుస్తుంది.

 టిల్లు స్క్వేర్ లో గ్లామర్ లుక్ లో ఆకట్టుకున్న ఈ అమ్మడు ఇప్పుడు రాబోతున్న సినిమాలో మాత్రం న్యాయం కోసం ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోరాడే యువతి పాత్రలో కనిపించనుంది. న్యాయవాదిగా  సీనియర్ నటుడు సురేశ్‌ గోపి నటిస్తున్నారు. తాజాగా ఈ సినిమాలో తన డబ్బింగ్ పనులను పూర్తి చేసినట్లు సోషల్ మీడియాలో పోస్ట్ ద్వారా అనుపమ పేర్కొంది.

ప్రభుత్వానికి వ్యతిరేకంగా న్యాయం కోసం పోరాడే జానకి అనే యువతిగా అనుపమ పరమేశ్వరన్ కనిపించనుండగా ఆమెకు లాయర్ గా సురేశ్‌ గోపి కనిపించనున్నారు. ఈ సినిమాకు ప్రవీణ్ నారాయణన్ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమాలో త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.

Related Articles

  !!!!!!!!   Hiring content writers   !!!!!!!!!
Contact us : [email protected]

Latest Articles