చేసి చూపించారంతే!

Monday, January 13, 2025

దీపావళి కానుకగా టాలీవుడ్ బాక్సాఫీస్ దగ్గర కొన్ని విడుదలై సందడి చేస్తున్న సంగతి తెలిసిందే. అయితే, ఈ సినిమాల్లో తెలుగు ప్రేక్షకుల్లో మంచి బజ్‌ని క్రియేట్ చేసిని సినిమాలు మాత్రం ‘క’, ‘లక్కీ భాస్కర్’.

ఈ రెండు సినిమాలు కూడా విభిన్నమైన కథాంశాలతో రూపుదిద్దుకున్నాయి. అయితే, ఈ రెండు సినిమాల్లో ఓ కామన్ పాయింట్ ఉంది. ఈ సినిమాల్లోని కంటెంట్‌పై మాత్రం చిత్రాల హీరోలు, దర్శకనిర్మాతలు పూర్తి నమ్మకంతోనే ఉన్నారు

అందులో కూడా ‘క’ సినిమాపై హీరో కిరణ్ అబ్బవరం అయితే పూర్తి కాన్ఫిడెంట్‌గా కనిపించాడు. ఇదే విషయాన్ని చిత్ర ప్రీ-రిలీజ్ ఈవెంట్‌లో కూడా సినిమా గురించి చాలా ఎమోషనల్‌గా చెప్పాడు. ఈ సినిమాతో సాలిడ్ హిట్ కొట్టి తీరుతానని కిరణ్ అబ్బవరం గట్టి నమ్మకంతోనే ఉన్నాడు.

ఇక ‘లక్కీ భాస్కర్’ మూవీ విషయంలో నిర్మాత నాగవంశీ కూడా పూర్తి కాన్ఫిడెన్స్‌ను వ్యక్త పరిచాడు. ‘లక్కీ భాస్కర్’ మూవీ ఓ విభిన్నమైన కథతో వస్తోందని.. ఈ సినిమాలో ఏదైనా తప్పును గుర్తిస్తే, వారికి పిలిచి మరీ పార్టీ ఇస్తానంటూ నాగవంశీ ఛాలెంజ్ కూడా చేసిన సంగతి తెలిసిందే.

ఇలా రెండు సినిమాలపై ఆయా చిత్ర నిర్మాతలు పూర్తి  కాన్ఫిడెంట్‌గా ఉండటంతో ప్రేక్షకుల్లో కూడా  ఈ సినిమాలపై మంచి అంచనాలను క్రియేట్ చేశారు. ఇక వారు చెప్పినట్లుగానే దీపావళి కానుకగా భారీ స్థాయిలో విడుదల చేసి బాక్సాఫీస్ దగ్గర మంచి హిట్టు కొట్టారు. ఇలా చెప్పి మరీ హిట్టు కొట్టడంతో ప్రేక్షకులు వారిని అభినందనలతో ముంచెత్తుతున్నారు.

Related Articles

  !!!!!!!!   Hiring content writers   !!!!!!!!!
Contact us : [email protected]

Latest Articles