ముందు మాట్లాడటం నేర్చుకో..డాక్టర్‌ కి సమంత కౌంటర్‌!

Sunday, December 22, 2024

హైడ్రోజన్ పెరాక్సైడ్ నెబ్యులైజేషన్‌ను ఉపయోగించడం గురించి రెండు రోజుల క్రితం టాలీవుడ్ స్టార్‌ హీరోయిన్‌ సమంత చేసిన పోస్ట్ వివాదాస్పదంగా మారిన విషయం తెలిసిందే. ఈ పోస్ట్ ఓ వైద్య నిపుణుడు ఘాటుగా స్పందించాడు. దురదృష్టవశాత్తూ నటి సమంత ఆరోగ్యం, సైన్స్ తెలియని నిరక్షరాస్యురాలని, హైడ్రోజన్ పెరాక్సైడ్ పీల్చడం ప్రమాదకరమని సోషల్ మీడియా వేదికగా ఆమె పై ఫైర్ అయ్యారు.

ఇక ప్రమాదకరమైన వైద్య విధానాలను ప్రచారం చేస్తున్నందుకు డాక్టర్లు ఆమె పై విమర్శలు గుప్పించడంతో సమంత తాజాగా ఓ క్లారిటీ ఇచ్చారు. తన ఇన్స్టా హ్యాండిల్ లో ఓ సుదీర్ఘ పోస్ట్ ను విడుదల చేసింది. “గత కొన్నేళ్లుగా నేను చాలా రకాల మందులు వాడుతున్నాను. నేను సిఫార్సు చేసిన ప్రతిదాన్ని తీసుకున్నాను. ఈ సలహాలు చాలా అర్హత కలిగిన వ్యక్తులు నాకు అందించడం జరిగింది. నేను వీలైనంత ఎక్కువ పరిశోధన చేసిన తర్వాతే వాటిని సూచిస్తాను. నేను మంచి ఉద్దేశంతో సూచించాను. ఒక పెద్దమనిషి నా పోస్ట్‌పై , నా ఉద్దేశాలపై బలమైన పదాలతో దాడికి దిగాడు. ఆయన కూడా ఒక వైద్యుడే. అతనికి నాకంటే ఎక్కువ తెలుసు ఆ విషయం గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు.

 అతని ఉద్దేశాలు కూడా గొప్పవని కచ్చితంగా నమ్ముతున్నాను. కానీ అతను తన మాటలతో రెచ్చగొట్టకుండా కాస్త మంచిగా చెప్పి ఉండాల్సింది. ముఖ్యంగా అతను నన్ను జైలులో వేయాలని సూచించాడు. నేను ఒక సెలెబ్రెటీల కాకుండా వైద్య చికిత్సలు అవసరమైన వ్యక్తిగా ఆ పోస్ట్ పెట్టాను. ఆ పోస్ట్ నుంచి నేను ఎలాంటి డబ్బు సంపాదించడం లేదు అలాగే వాటిని ప్రమోట్ కూడా చేయడం లేదు.

ఆర్థికంగా కొంత మంది చికిత్సలను పొందలేరు. అలాంటి వారి కోసం నేను ఆలోచిస్తాను. 25 సంవత్సరాలుగా DRDOలో సేవలందించిన ఒక ఉన్నతమైన డాక్టర్‌  నాకు ఈ ప్రత్యామ్నాయ చికిత్సను చెప్పారు. మెడికేషన్ పనిచేయనివారికి ఈ చికిత్సను (నెబ్యులైజేషన్‌) ఒక ఎంపికగా నేను వివరించాను. నా పై పరిశోధన చేసిన తర్వాత నాలాంటి సామాన్యులకు సూచిస్తాను. “ది లివర్ డాక్” నన్ను టార్గెట్ చేయడం కంటే నా డాక్టర్‌తో ఇదే చర్చ జరిపి ఉంటే బాగుండేదని ఆమె పై ఫైర్ అయిన “ది లివర్ డాక్” కు ఘాటుగా బదులిచ్చింది సామ్‌.

Related Articles

  !!!!!!!!   Hiring content writers   !!!!!!!!!
Contact us : [email protected]

Latest Articles