అందులోకి లారెన్స్‌!

Thursday, December 26, 2024

కోలీవుడ్ లో ఉన్నటువంటి ప్రముఖ హీరో,  డైరెక్టర్లలో మన తెలుగు ఆడియెన్స్ కి కూడా బాగా తెలిసిన మల్టీ టాలెంటెడ్ నటుడు రాఘవ లారెన్స్ కూడా ఒకరు. మరి తన పుట్టినరోజు కానుకగా పలు భారీ సినిమాలు నిన్న ప్రకటించడం జరిగింది. అయితే వాటిలో దర్శకుడు లోకేష్ కనగరాజ్ తో వర్క్ చేసే ప్రాజెక్ట్ కూడా ఒకటి ప్రేక్షకుల ముందుకు వచ్చింది.

గత కొన్నాళ్ల కితమే లోకేష్ అందించిన కథతో “బెంజ్” అనే సినిమాని తాజాగా మూవీ మేకర్స్ ప్రేక్షకుల ముందుకు తీసుకుని వచ్చారు.  అయితే ఈ సినిమాపై కూడా నిన్న ఓ అప్డేట్ ని అందించారు. ఇది చూసేందుకు లోకేష్ మార్క్ అనౌన్సమెంట్ మోషన్ పోస్టర్ గా క్రేజీ లెవెల్లో కనిపించింది. అలాగే ఇందులో లోకేష్ కనగరాజ్ కూడా కనిపించి అందరికీ షాక్‌ ఇచ్చారు.

అయితే ఇది చూసిన చాలా మంది లోకి సినిమాటిక్ యూనివర్స్ లో భాగమైన సినిమానే అని అనుకుంటున్నారు కానీ తాను మాత్రం ఇది కొత్త ప్రపంచం అన్నట్టుగా చెప్పుకొచ్చాడు. మరి ఇది తన ఎల్‌సీయూ లో భాగమైన సినిమానా లేక మరో కొత్త ప్రపంచాన్ని సృష్టిస్తున్నాడా అనేది తెలియాల్సి ఉంది. ఇక ఈ అనౌన్సమెంట్ వీడియోలో కూడా చాలా వరకు డ్రగ్స్ అండ్ యాక్షన్ విజువల్స్ కనపడ్డాయి.

అలాగే లోకేష్ మార్క్ కుకుకింగ్ తోనే కనిపించింది. దీనితో ఈ సినిమా తన యూనివర్స్ లో భాగమే అని అంతా అనుకుంటున్నారు. ఇక ఈ చిత్రానికి బక్కియ రాజ్ కన్నన్ దర్శకత్వం వహిస్తుండగా లోకేష్ తన జి స్క్వాడ్ బ్యానర్ పై నిర్మాణం వహిస్తున్నాడు.

Related Articles

  !!!!!!!!   Hiring content writers   !!!!!!!!!
Contact us : [email protected]

Latest Articles