నవ్వుల జాగారం!

Friday, December 5, 2025

యంగ్ హీరో సందీప్ కిషన్ తన కెరీర్‌లో 30వ చిత్రంగా నటిస్తున్న తాజా సినిమా ‘మజాకా’ ఇప్పటికే షూటింగ్ పనులు ముగించుకుని పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో బిజీగా ఉంది. ఈ సినిమాకు త్రినాథరావు నక్కిన దర్శకత్వం వహిస్తుండడంతో ఈ మూవీపై మంచి బజ్ క్రియేట్ అయ్యింది. ఇక ఈ సినిమాకు సంబంధించిన పోస్టర్స్, టీజర్ ఈ మూవీపై పాజిటివ్ వైబ్స్ ని పెంచేశాయి.

పూర్తి కామెడీ ఎంటర్‌టైనర్ సినిమాగా ఈ మూవీ రాబోతుంది. అయితే, ఈ సినిమాని ఫిబ్రవరి 21న గ్రాండ్ గా విడుదల చేయాలని మేకర్స్ అనుకున్నారు. కానీ, తాజాగా ఈ సినిమా విడుదల తేదీని వాయిదా వేసినట్లు చిత్ర యూనిట్ పేర్కొంది. ఈ మూవీని శివరాత్రి పండుగ కానుకగా ఫిబ్రవరి 26న గ్రాండ్ గా విడుదల చేస్తున్నట్లు మేకర్స్ ప్రకటించారు.

ఈ మేరకు ఓ సరికొత్త పోస్టర్‌తో వారు కొత్త విడుదల తేదీని ప్రకటించారు.ఇక ఈ సినిమాలో యంగ్ బ్యూటీ రీతూ వర్మ హీరోయిన్‌గా నటిస్తుండగా రావు రమేష్, మన్మథుడు ఫేం అన్షు కీలక పాత్రల్లో నటిస్తున్నారు.

Related Articles

  !!!!!!!!   Hiring content writers   !!!!!!!!!
Contact us : [email protected]

Latest Articles