మనోజ్ ‘మిరాయ్’ పై లేటెస్ట్ అప్ డేట్

Thursday, December 26, 2024

యంగ్‌ టాలెంటెడ్‌ డైరెక్టర్‌ కార్తీక్ ఘట్టమనేని తెరకెక్కిస్తున్న “మిరాయ్” సినిమాలో రాకింగ్ స్టార్ మంచు మనోజ్ చాలా రోజుల తరువాత నటిస్తున్న సంగతి తెలిసిందే. ఐతే, మనోజ్ పాత్ర పై ఇప్పటికే అనేక ఆసక్తికరమైన వార్తలు వినిపిస్తూనే ఉన్నాయి. అనేక ఇంట్రెస్టింగ్ రూమర్స్ వినిపిస్తూనే ఉన్నాయి. తాజాగా ఈ సినిమా నుంచి మరో రూమర్‌ బయటకు వచ్చింది.

ఈ సినిమాలో మనోజ్ పాత్ర చాలా వైల్డ్ గా ఉంటుందని.. పైగా స్క్రీన్ ప్లే మొత్తం ఈ క్యారెక్టర్ చుట్టే తిరుగుతుందని.. అందుకే మనోజ్ పాత్ర ఆధారంగా మిరాయ్ సీక్వెల్ కూడా ఉండే అవకాశం ఉన్నట్లు సమాచారం. కాగా ఆ మధ్య మనోజ్ పుట్టినరోజు సందర్భంగా ఈ సినిమా నుంచి ఓ గ్లింప్స్ వీడియోను చిత్ర బృందం విడుదల చేసిన సంగతి తెలిసిందే. ఆ గ్లింప్స్ లో సాలిడ్ మాస్‌ యాక్షన్ లుక్ లో.. కత్తి చేత పట్టుకొని “ది బ్లాక్ స్వార్డ్” గా మనోజ్ బాగా హైలైట్‌ అయిపోయాడు.

మొత్తానికి ఆ గ్లింప్స్ అభిమానులను చాలా బాగా ఆకట్టుకుంటుంది. అందుకే, మనోజ్ కూడా ఈ సినిమా పై భారీగా అంచనాలు పెట్టుకున్నాడు. అన్నట్టు ఈ చిత్రానికి గౌర హరీష్ నే సంగీతం అందిస్తుండగా పీపుల్ మీడియా ఫ్యాక్టరీ వారు నిర్మాణం వహిస్తున్నారు. తేజ సజ్జ “హనుమాన్” తర్వాత చేస్తున్న క్రేజీ ప్రాజెక్ట్ కూడా ఈ మూవీనే.

Related Articles

  !!!!!!!!   Hiring content writers   !!!!!!!!!
Contact us : [email protected]

Latest Articles