ఉస్తాద్‌ భగత్ సింగ్‌ నుంచి లేటెస్ట్‌ అప్డేట్!

Andhrawatch
1 Min Read

 పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా చేస్తున్న తాజా సినిమాల్లో మాస్ ఎంటర్టైనర్ చిత్రం ఉస్తాద్ భగత్ సింగ్” కూడా ఒకటి. డైరెక్టర్‌ హరీష్ శంకర్ తో “గబ్బర్ సింగ్” లాంటి భారీ హిట్ తర్వాత వస్తున్న సినిమా ఇది కావడంతో ఈ సినిమా పై మంచి అంచనాలు ఉన్నాయి. అయితే ఈ సినిమా షూటింగ్‌ ని చాలా తక్కువ సమయంలోనే హరీష్‌ కంప్లీట్‌ చేసి అందర్ని ఆశ్చర్యపరిచాడు.

అయితే ఈ సినిమాపై తాజాగా నిర్మాతలు ఇంట్రెస్టింగ్ అప్డేట్ ని ఇప్పుడు ప్రేక్షకుల ముందుకు తీసుకుని వచ్చారు. ఈ సినిమా అతి త్వరలోనే షూటింగ్ స్టార్ట్ అవుతుంది. పవన్ డేట్స్ ఇస్తే డిసెంబర్ నాటికి షూటింగ్ కంప్లీట్ చేసేస్తామని మూవీ టీమ్‌ తెలిపింది. అలాగే ఈ సెప్టెంబర్ 2న పవన్ కళ్యాణ్ పుట్టిన రోజు కానుకగా ఒక స్పెషల్ ట్రీట్ ని అందిస్తున్నట్టుగా ఇప్పుడు మేకర్స్ తెలియజేసారు. దీంతో పవన్ బర్త్ డే కి ఓ క్రేజీ ట్రీట్‌ రాబోతుందని చెప్పుకొవచ్చు. ఇక ఈ సినిమాకి దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తుండగా మైత్రి మూవీ మేకర్స్ నిర్మాణం చేపట్టిన సంగతి తెలిసిందే.

Share This Article