అఖండ నుంచి తాజా అప్డేట్‌!

Tuesday, January 21, 2025

నందమూరి నటసింహం బాలకృష్ణ -బోయపాటి శ్రీను కాంబోలో వచ్చిన అఖండ అద్భుత విజయాన్ని సాధించింది. దీంతో అఖండ 2 పై భారీ అంచనాలు ఏర్పడ్డాయి.  అయితే ఈ సినిమా షూటింగ్ ఎప్పుడు మొదలవుతుందంటూ బాలయ్య ఫ్యాన్స్ పోస్ట్ లు పెడుతున్నారు. ప్రస్తుతం ఈ సినిమా ప్రీ ప్రొడక్షన్ వర్క్ చివరి దశలో జరుపుకుంటుంది.

డిసెంబర్ లో ఈ సినిమా షూటింగ్ ను మొదలు పెట్టాలని ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం. ఈ షెడ్యూల్ లో బాలయ్య పాత్ర తాలూకు పరిచయ షాట్స్ ను తీయనున్నారంట. మొత్తానికి ఈ సినిమా కోసం బాలయ్య ఫ్యాన్స్ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. బోయపాటి శ్రీను ఇప్పటికే ‘అఖండ 2’ స్క్రిప్ట్ పూర్తి చేసుకున్నట్లు తెలుస్తుంది.

ప్రస్తుతం డైలాగ్ వెర్షన్ పై కసరత్తులు జరుగుతున్నాయి. కాగా ‘అఖండ 2’ లో బాలీవుడ్ స్టార్ సంజయ్ దత్ కూడా ఓ ముఖ్య పాత్రలో నటించబోతునట్లు సమాచారం. ప్రస్తుతం బాలయ్య.. డైరెక్టర్ బాబీతో  ఓ సినిమా తెరకెక్కిస్తున్నారు.

Related Articles

  !!!!!!!!   Hiring content writers   !!!!!!!!!
Contact us : [email protected]

Latest Articles