రిషబ్ శెట్టి హీరోగా, తన దర్శకత్వంలో తెరకెక్కిన భక్తిరస ప్రధాన చిత్రం కాంతార 1 ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సినిమాకు ముందుగా వచ్చిన భాగం మంచి విజయాన్ని అందుకున్నందున ప్రీక్వెల్ పై కూడా ప్రేక్షకుల్లో భారీ అంచనాలు ఏర్పడ్డాయి. మొదట ఈ సినిమా విడుదలకు ఒకరోజు ముందే ప్రీమియర్ షోలు పెట్టే ఆలోచనలో మేకర్స్ ఉన్నారు. కానీ చివరి నిమిషంలో ఏర్పడిన కొన్ని ఇబ్బందుల కారణంగా ఆ ప్రణాళిక మారింది.
ఇప్పుడు పరిస్థితి ప్రకారం యూఎస్‌లో కొన్ని ప్రాంతాలు మినహా, తెలుగు రాష్ట్రాల్లో ఎక్కడా ప్రీమియర్ షోలు లేవని స్పష్టం చేశారు. ముఖ్యంగా నైజాం, ఆంధ్రప్రదేశ్ ప్రాంతాల్లో కూడా ప్రీమియర్స్ జరగవని గీతా డిస్ట్రిబ్యూషన్ సంస్థ ప్రకటించింది.
