కొత్త సినిమా పై తాజా సమాచారం!

Friday, December 5, 2025

కొత్త సినిమా పై తాజా సమాచారం! ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, త్రివిక్రమ్ శ్రీనివాస్‌ తో కొత్త ప్రాజెక్ట్ ను ఇప్పటికే అధికారికంగా ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే, ఈ సినిమా ఎప్పుడు స్టార్ట్ అవుతుంది ?, ఎప్పుడు విడుదల కాబోతుంది ? అంటూ అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

ఇప్పుడు ఈ సినిమా పై మరో క్రేజీ గాసిప్ వినపడుతుంది. త్రివిక్రమ్ ఈ సినిమా స్క్రిప్ట్ వర్క్ పూర్తి చేసినట్లు తెలుస్తుంది. ఈ నెల నాలుగో వారం నుంచి బన్నీ కూడా త్రివిక్రమ్ తో కూర్చుంటారని.. పాత్ర గెటప్ అండ్ సెటప్ విషయంలో చర్చ జరుపుతారని.. ఇక షూటింగ్ ను జూన్ నుంచి మొదలు పెట్టాలని అనుకుంటున్నారంట.

జులాయి, సన్ ఆఫ్ సత్యమూర్తి, అల వైకుంఠపురములో వంటి సూపర్ హిట్‌ సినిమాల తర్వాత, అల్లు అర్జున్ – త్రివిక్రమ్ మరోసారి జత కట్టారు. ఈ సినిమాని 300 కోట్ల భారీ బడ్జెట్ తో తెరకెక్కిస్తున్నట్లు సమాచారం. మొత్తానికి తమ నాలుగో చిత్రాన్ని త్రివిక్రమ్ – బన్నీ చాలా గ్రాండ్ గా ప్లాన్‌ చేస్తున్నట్లు సమాచారం.

Related Articles

  !!!!!!!!   Hiring content writers   !!!!!!!!!
Contact us : [email protected]

Latest Articles