ప్రభాస్ కథానాయకుడిగా నటిస్తున్న తాజా చిత్రం “ది రాజా సాబ్” నుంచి మ్యూజిక్ అప్డేట్స్ ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారాయి. ఈ చిత్రానికి మారుతీ దర్శకత్వం వహిస్తుండగా, సంగీతం కోసం థమన్ పని చేస్తున్న విషయం తెలిసిందే. ఇప్పటివరకు వచ్చిన వీడియో గ్లింప్స్, టీజర్ లోని బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్ మాత్రమే కాదు, థమన్ బీట్స్ కూడా మంచి ఆకర్షణగా నిలిచాయి.
తాజా సమాచారం ప్రకారం, ఈ సినిమాకు సంబంధించిన ఫస్ట్ సింగిల్ కోసం మేకర్స్ ప్లాన్ ఖరారైనట్టుగా టాక్ వినిపిస్తోంది. ఆగస్ట్ మొదటి వారం నుంచే ఆ పాటను విడుదల చేయాలనే ఆలోచనలో ఉన్నట్టు ఫిలిం నగర్ వర్గాల్లో చర్చ జరుగుతోంది. అందులోనూ ఈ పాట ప్రభాస్ మాత్రమే కనిపించే సోలో సాంగ్ అని అంటున్నారు.
ఇదిలా ఉంటే, “ది రాజా సాబ్” విడుదల తేది కూడా ఫిక్స్ అయింది. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ నిర్మిస్తున్న ఈ చిత్రాన్ని డిసెంబర్ 5న పాన్ ఇండియా స్థాయిలో భారీగా విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. కొంత ఆలస్యమైనా, దర్శకుడు మారుతీ, థమన్ కలిసి ఫ్యాన్స్‌కు మంచి వినోదం అందించబోతున్నట్టు ఫ్యాన్స్‌లో మంచి ఉత్కంఠ నెలకొంది.
