బాక్సాఫీస్ దగ్గర కూలీ, వార్ 2 సినిమాలు ఒకేసారి రిలీజ్ కావడంతో రెండు సినిమాలకూ భారీ హైప్ ఏర్పడింది. ఈ రెండు ప్రాజెక్ట్స్ మీద తెలుగు ప్రేక్షకుల్లో కూడా మంచి ఆసక్తి ఉండటంతో, రిలీజ్ అయిన రోజు నుంచే థియేటర్లలో మంచి రద్దీ కనిపించింది. మొదటి రోజు కలెక్షన్ల విషయంలో పెద్ద తేడా లేకుండా పోటీగా సాగినా, రెండో రోజు మాత్రం కూలీ సినిమా వార్ 2 కంటే బలమైన ఫిగర్స్ సాధించడం టాక్ ఆఫ్ ది టౌన్ అయ్యింది.
నైజాంలో రెండో రోజు వార్ 2కి దాదాపు 3 కోట్ల షేర్ వచ్చినా, కూలీ మాత్రం 3.7 కోట్ల వరకు వసూలు చేసిందని ట్రేడ్ సర్కిల్స్ చెబుతున్నాయి. అంటే కేవలం ఒక రోజులోనే వార్ 2ని ఓవర్‌టేక్ చేసి కూలీ ముందంజలోకి రావడం కొంత ఆశ్చర్యం కలిగించింది. ఇప్పుడు మూడో రోజు వసూళ్లు ఎలా ఉంటాయన్నదే సినిమా ప్రేమికుల్లో కొత్త ఆసక్తిని పెంచింది.
