సీనియర్ హీరోయిన్ కుష్బూ సుందర్ కి సౌత్ లో మంచి ఫాలోయింగ్ ఉంది. ఇప్పుడు కుష్బూ సుందర్ కూతురు అవంతిక తెరంగేట్రం చేయనున్నట్లు తెలుస్తోంది. తాజాగా అవంతిక సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన ఫొటోలు వైరల్ గా మారాయి. ఆ పిక్స్ చూసిన నెటిజన్లు కొత్త హీరోయిన్ వచ్చేసిందని కామెంట్లు చేస్తున్నారు. మరోవైపు, అవంతిక తన నటనా కెరీర్ గురించి గతంలో మాట్లాడుతూ.. నాకు నటించాలని మనసులో ఉంది. ఐతే, ఎప్పుడూ ఆ విషయాన్ని సీరియస్‌గా తీసుకోలేదు’ అని అవంతిక తెలిపింది.
దర్శకుడు సుందర్ ను కుష్బూ లవ్ మ్యారేజ్ చేసుకుంది. వీరికి ఇద్దరు కూతుర్లు. ఎలాగూ సినీ ఇండస్ట్రీలోకి వారసులు ఎంట్రీ ఇవ్వడం సాధారణమైపోయింది. ఈ క్రమంలోనే అవంతిక హీరోయిన్‌గా పరిచయం కాబోతుందని టాక్ నడుస్తోంది. కాగా తెలుగులో అనేక సూపర్ హిట్ చిత్రాల్లో నటించిన కుష్బూ కూతురు ఇప్పుడు హీరోయిన్ గా ఎంట్రీ ఇస్తోంది అని వార్తలు రావడంతో అభిమానులు సంతోషంగా ఫీల్ అవుతున్నారు.