కుమ్మేసిన కిరణ్‌ ”క” థియేట్రికల్‌ బిజినెస్‌!

Saturday, December 21, 2024

యంగ్‌ హీరో కిరణ్‌ అబ్బవరం దర్శక ద్వయం సుజీత్‌- సందీప్‌ అనే ఇద్దరు కొత్త దర్శకులతో ”క” అనే చిత్రంలో నటిస్తున్నాడు. పీరియాడికల్ డ్రామా నేపథ్యంలో సాగనున్న ఈ చిత్రాన్ని భారీ బడ్జెట్‌ తో తెరకెక్కిస్తున్నాడు ఈ యంగ్‌ హీరో. ఈ దఫా ఎలాగైనా హిట్టు కొట్టి భారీ విజయాన్ని అందుకోవాలని ఎంతగానో ఎదురు చూస్తున్నాడు.

ఈ సినిమా తెలుగు, తమిళ్, మలయాళం, కన్నడ, హిందీ భాషలలో తెరకెక్కుతోంది. ఇటీవల విడుదలైన ఈ మూవీ ట్రైలర్ ఇండస్ట్రీ సర్కిల్స్ లో కాసింత ఆసక్తిని పెంచింది. విరూపాక్ష టైపు మిస్టిక్ థ్రిల్లర్ నేపథ్యంలో రానున్న ‘ క ‘ థియేట్రికల్ బిజినెస్ కు మంచి గిరాకి ఏర్పడింది. తాజాగా ఈ చిత్రం థియేట్రికల్ రైట్స్ అమ్మకాలు ముగిసాయి. పొలిమేర -3 నిర్మాత నందిపాటి వంశీ రెండు తెలుగు రాష్టాల హక్కులు కొనుగోలు చేసిన సంగతి తెలిసిందే.

13 కోట్ల రూపాయల దగ్గర మొదలైన బేరం చివరికి 12 కోట్ల రూపాయల దగ్గర ఆగింది. అధికారక ప్రకటన త్వరలోనే రాబోతుంది. ఈ మధ్య కాలంలో సరైన హిట్టులేని కిరణ్ అబ్బవరం చిత్రం ఈ రేంజ్ బిజినెస్ చేయడం మాములు విషయం కాదు. ఒక రకంగా కిరణ్ జాక్ పాట్ కొట్టాడని చెప్పుకోవాల్సిందే. కాగా ఈ హీరో తన మార్కెట్ కి మించి భారీ బడ్జెట్ తో ‘క’ చిత్రాన్ని నిర్మిస్తున్నాడని సినీ వర్గాల టాక్‌. ప్రస్తుతం షూటింగ్ దశలో ఉన్న ఈ చిత్రాన్ని ఈ ఏడాదిలోనే థియేటర్లలోకి తెచ్చేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. త్వరలోనే పెళ్లి పీటలు ఎక్కబోతున్న కిరణ్ కు ‘క ‘ రూపంలో హిట్ దక్కుతుందేమో చూడాలి.

Related Articles

  !!!!!!!!   Hiring content writers   !!!!!!!!!
Contact us : [email protected]

Latest Articles