కుబేర షూటింగ్‌..వైరల్ అవుతున్న వీడియో!

Wednesday, December 18, 2024

కోలీవుడ్‌ స్టార్‌ నటుడు ధనుష్‌ నటిస్తున్న చిత్రాల్లో కుబేర సినిమా ఒకటి. ఈ సినిమాని టాలీవుడ్‌ డైరెక్టర్‌ శేఖర్‌ కమ్ముల డైరెక్షన్‌ లో ఈ సినిమా రూపుదిద్దుకుంటుంది. ఈ మూవీలో కన్నడ భామ రష్మిక మందన్నా ఫీ మేల్‌ లీడ్ రోల్‌ చేస్తుంది. అక్కినేని నాగార్జున కీలక పాత్రలో నటిస్తున్నాడు. కొన్ని రోజుల క్రితం ముంబైలో భారీ షెడ్యూల్‌లో ధనుష్‌, రష్మిక మందన్నాపై వచ్చే కీలక సన్నివేశాలను చిత్రీకరించినట్టు వార్తలు వినిపిస్తున్నాయి.

తాజా అప్‌డేట్‌ ప్రకారం కుబేర షూటింగ్ హైదరాబాద్‌లో జరుగుతుంది. ప్రస్తుతం ధనుష్‌, అక్కినేని నాగార్జున మధ్య వచ్చే యాక్షన్‌ సన్నివేశాలను చిత్రీకరిస్తున్నట్టు సమాచారం. ఇదే విషయాన్ని తెలియజేస్తూ కుబేరలో షూటింగ్‌ లొకేషన్‌లో తీసిన వీడియో ఒకటి ఇప్పుడు నెట్టింట వైరల్‌ గా మారింది. రోప్‌ వేలతో షూట్‌ చేస్తున్నట్టు వీడియో ద్వారా అర్థమవుతోంది. ధైర్యవంతులనే అదృష్టం వరిస్తుంది.. అంటూ
ఓ క్యాప్షన్‌తోపాటు నటుడు ధనుష్ చెదిరిన వెంట్రుకలు, మాసిన గడ్డంతో ఉండి నవ్వుతూ కనిపిస్తున్న కుబేర ఫస్ట్‌ లుక్‌  పోస్టర్‌ సినిమా పై భారీ అంచనాలను పెంచుతుంది.

సోషల్ డ్రామా నేపథ్యంలో తెరకెక్కుతున్న కుబేర ప్రపంచవ్యాప్తంగా తెలుగు, తమిళం, హిందీ, కన్నడ, మలయాళ భాషల్లో గ్రాండ్‌గా విడుదల కానుంది. ధనుష్‌ దీంతోపాటు స్వీయ దర్శకత్వంలో డీ 51 అనే సినిమా చేస్తున్నాడన్న విషయం తెలిసిందే.

Related Articles

  !!!!!!!!   Hiring content writers   !!!!!!!!!
Contact us : [email protected]

Latest Articles