ఓటీటీ డేట్‌ లాక్‌ చేసుకున్న కుబేర!

Friday, January 30, 2026

టాలీవుడ్‌లో మంచి భావోద్వేగాలు, సున్నితమైన కథలతో ప్రేక్షకుల మనసుల్లో స్థానం సంపాదించిన శేఖర్ కమ్ముల మరోసారి తన మార్క్ చిత్రంతో ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. అక్కినేని నాగార్జున, ధనుష్, రష్మిక మందన్న ప్రధాన పాత్రల్లో నటించిన తాజా చిత్రం ‘కుబేర’ ఇటీవల థియేటర్లలో విడుదలై భారీ స్పందన అందుకుంది.

ఈ సినిమాలో చూపించిన ఎమోషన్స్, కథనంలోని విలువలు ప్రేక్షకుల హృదయాలను తాకాయి. సాధారణంగా శేఖర్ కమ్ముల సినిమాలు ఎంత గుండెను తాకేలా ఉంటాయో, ఈ సినిమా కూడా అదే స్థాయిలో భావోద్వేగాలతో నిండిపోయి ఉంది. ఫ్యామిలీ ఆడియెన్స్ నుంచి యువత వరకు అందరూ ఈ సినిమాను థియేటర్లలో ఆస్వాదించారు.

కొందరు సినిమా థియేటర్లలో చూడలేకపోయినవారు దీని ఓటీటీ రిలీజ్ కోసం ఎంతో కాలంగా ఎదురుచూస్తున్నారు. తాజాగా వారి ఎదురుచూపులకు తెరపడేలా ఓ అధికారిక అప్డేట్ విడుదలైంది. ఈ సినిమా జూలై 18 నుంచి ప్రముఖ డిజిటల్ స్ట్రీమింగ్ ప్లాట్‌ఫామ్ అయిన అమెజాన్ ప్రైమ్ వీడియోలో అందుబాటులోకి రాబోతోంది.

ఇప్పటికే థియేటర్లలో మంచి పేరు తెచ్చుకున్న ఈ చిత్రం ఓటీటీ మీద కూడా మంచి రెస్పాన్స్ రాబట్టే అవకాశాలున్నాయి. ఇక మ్యూజిక్ డైరెక్టర్ దేవిశ్రీ ప్రసాద్ అందించిన సంగీతం ఈ సినిమాకు మరింత ఆకర్షణగా మారింది. భావోద్వేగాలు, మెచ్చుకునే నటన, మెలోడియస్ మ్యూజిక్ అన్నీ కలబోతగా రూపొందిన ఈ చిత్రం ఇప్పుడు ఓటీటీలో అందుబాటులోకి రావడంతో మరిన్ని ప్రేక్షకుల మనసులు గెలిచే అవకాశముంది.

Related Articles

  !!!!!!!!   Hiring content writers   !!!!!!!!!
Contact us : [email protected]

Latest Articles