వామ్మో ఫస్ట్ గ్లింప్స్‌ తోనే సస్పెన్స్‌ క్రియేట్‌ చేసిన కుబేర!

Thursday, December 19, 2024

టాలీవుడ్ దర్శకుడు శేఖర్ కమ్ముల తెరకెక్కిస్తున్న లేటెస్ట్ మూవీ ‘కుబేర’ ఇప్పటికే ప్రేక్షకుల్లో మంచి బజ్‌ని క్రియేట్ చేసింది. ఈ సినిమాలో అక్కినేని నాగార్జున, ధనుష్, రష్మిక  వంటి స్టార్ నటులు యాక్ట్‌ చేస్తుండటంతో ఈ సినిమా ఎలా ఉంటుందా అనే ఆసక్తి అందరిలో మొదలైయ్యింది. అయితే, ఇప్పుడు ఈ సినిమాపై మరింత ఆసక్తిని క్రియేట్ చేసింది ఈ సినిమా ఫస్ట్ వీడియో గ్లింప్స్.

మహేష్ బాబు చేతుల మీదుగా ఈ చిత్ర ఫస్ట్ గ్లింప్స్‌ను చిత్ర బృందం విడుదల చేసింది. ఈ గ్లింప్స్ ఆద్యంతం సస్పెన్స్ కథతో సాగింది. ఈ వీడియో గ్లింప్స్ చూస్తే ఓ ధనవంతుడికి సంబంధించిన కథగా ఈ సినిమా ఉంటుందని… అయితే, అందులో కుబేరుడిగా మారేది ఎవరనేది మనకు మున్ముందు చూపెట్టనున్నట్లు ఈ వీడియో గ్లింప్స్ చూస్తే తెలుస్తుంది. ఇక ఈ సినిమాలో యాక్షన్‌తో పాటు సస్పెన్స్, ఎమోషన్స్ కూడా పుష్కలంగా ఉండనున్నట్లు ఈ గ్లింప్స్ చెబుతోంది.

ఈ సినిమాలో బాలీవుడ్ నటుడు జిమ్ సెర్బ్ కూడా ఓ కీలక పాత్రలో నటిస్తున్నాడు. ఈ సినిమాలో నాగార్జున కొత్త లుక్స్‌తో ఆకట్టుకోనున్నాడు. రష్మిక కూడా చాలా సింపుల్‌గా కనిపిస్తోంది. ఇక ధనుష్ మాత్రం బిచ్చగాడి తరహా లుక్‌తో పాటు మరో లుక్‌లోనూ కనిపించి సినిమాపై మరింత ఆసక్తిని రేకెత్తించాడు. దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్న ఈ సినిమాను సునీల్ నారంగ్, పుస్కూర్ రామ్ మోహన్ రావు సంయుక్తంగా ప్రొడ్యూస్ చేస్తున్నారు.

Related Articles

  !!!!!!!!   Hiring content writers   !!!!!!!!!
Contact us : [email protected]

Latest Articles