సూపర్‌ ఆఫర్ పట్టేసిన కృతిశెట్టి!

Wednesday, January 22, 2025

తొలి సినిమా ఉప్పెనతో టాలీవుడ్‌ లో ఎంట్రీ ఇచ్చి..కుర్రాళ్ల గుండెల్లో సునామీ సృష్టించింది కృతి శెట్టి. ఆ సినిమా బంపర్‌ హిట్‌ అవ్వడంతో  ఇండస్ట్రీలో ఆమె పేరు మారు మోగిపోయింది. దీంతో ఆఫర్లు క్యూ కట్టాయి. ‘బంగార్రాజు’, `శ్యామ్ సింగ‌రాయ్‌` డీసెంట్ సినిమాలుగా నిలిచాయి. అయితే ఆ త‌ర‌వాత ఆమె ట్రాక్ త‌ప్పిపోయింది. ఒక్క‌టంటే ఒక్క హిట్ కూడా ఆమె ఖాతాలో పడలేదు. అన్నీ డిజాస్ట‌ర్లే. ఇటీవ‌ల వ‌చ్చిన ‘మ‌న‌మే’ కూడా ఆమెకు కలిసి రాలేదు. ఈ సినిమాతో కృతి ఫామ్ లోకి వ‌స్తుంద‌ని అంతా అనుకున్నారు.

 కానీ అదేం జ‌ర‌గ‌లేదు. ఈ ఫ్లాపుతో కృతి శెట్టి కెరీర్ ఏమౌతుందో అని అంతా అనుకుంటున్నారు. కానీ ఇప్పుడు మరో మంచి ఆఫర్ కృతిని వెదుక్కుంటూ వచ్చింది. దుల్క‌ర్ సల్మాన్ హీరోగా సెల్వ‌రాజ్ ద‌ర్శ‌క‌త్వంలో ఓ చిత్రం తెరకెక్కనుంది. రానా నిర్మాత‌గా వ్య‌వ‌హ‌రిస్తుండ‌డం విశేషం. ఈ చిత్రంలో క‌థానాయిక‌గా కృతిని ఎంచుకొన్న‌ట్టు తెలుస్తోంది. దుల్క‌ర్‌తో జోడీ క‌ట్ట‌డం కృతికి ఇదే తొలిసారి.

ఈ అవ‌కాశం గ‌నుక నిజంగా కృతిని వరిస్తే కనుక, అది వ‌ర‌మే అనుకోవాలి.  సెల్వ‌రాజ్ త‌న హీరోయిన్ల పాత్ర‌ల్ని అందంగా తీర్చిదిద్దుతాడు. అందులోనూ దుల్క‌ర్ పాన్ ఇండియా హీరో. సినిమా హిట్ట‌యితే అన్ని భాష‌ల్లోనూ మంచి పేరు వ‌స్తుంది. ఈ అవ‌కాశం… కృతి నిల‌బెట్టుకొంటే, హిట్ సినిమా పడ‌లేద‌న్న బెంగ తీరిపోతుంది. దుల్క‌ర్ ఇటీవ‌లే ‘క‌ల్కి’లో ఓ ముఖ్య పాత్ర పోషించిన విషయం తెలిసిందే. ప్రస్తుతం తాను హీరోగా రూపొందుతున్న ‘ల‌క్కీ భాస్క‌ర్‌’ విడుద‌ల‌కు రెడీ అయ్యింది. ఈ సినిమా త‌ర‌వాతే సెల్వ‌రాజ్ ప్రాజెక్ట్ ప‌ట్టాలెక్కనుంది.

Related Articles

  !!!!!!!!   Hiring content writers   !!!!!!!!!
Contact us : [email protected]

Latest Articles